నయన్ మళ్ళీ బ్రేకప్ చెప్పిందా?
సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతారకి పేరుంది.
సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతారకి పేరుంది. కేవలం సినిమాలతో మాత్రమే కాదు బ్రేకప్ లతో కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ భామ.. కేరియర్ ప్రారంభంలో హీరో శింబుతో రిలేషన్ ని మైంటైన్ చేసిన నయన్ ఆ తరువాత అతడికి బ్రేకప్ చెప్పేసి దర్శకుడు ప్రభుదేవాతో సహజీవనం చేసింది .. ఇక పెళ్లి వరకు వెళ్ళింది అనుకున్న వీరి ప్రేమ బ్రేకప్ తో ఎండ్ అయిపొయింది. ప్రస్తుతం నయన్ తమిళ స్టార్ డైరెక్టర్ విష్నేష్ శివన్‌తో రిలేషన్లో ఉంది.
ఎక్కడికి వెళ్లిన జంటగానే..
ఎక్కడికి వెళ్లిన శివన్-నయనతార కలిసే వెళుతారు. బర్త్ డే వేడుకలు, క్రిస్మస్, ఓనమ్ ఇలా ఏ పండుగ వచ్చినా సరే ఈ ఇద్దరూ సెలబ్రేట్ చేసుకని దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని ఓ వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.
సింగిల్ గానే ఫోటో..
నిన్న మొన్నటివరకు ప్రియుడు విష్నేష్ శివన్ తో కలిసి ఉన్న నయన్ ఇప్పుడు అతనికి బ్రేకప్ చెప్పేసిందనే వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా నడుస్తుంది. ఏ ఈవెంట్ ని అయినా తన ప్రియుడు విష్నేష్తో కలిసి చేసుకునే నయన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విష్నేష్ లేకుండానే జరుపుకుందట. న్యూ ఈయర్ సెలబ్రేషన్ లో భాగంగా సింగీల్ గా దిగిన ఫోటో ని నయన్ షేర్ చేసింది.
కారణం ఇదేనా?
గత కొద్దికాలంగా రిలేషన్లో ఉన్న నయన్‌ని విష్నేష్ పెళ్లి కోసం ఒత్తిడి చేస్తున్నాడని దానికి నయన్ నో చెప్పిందని, ఇప్పుడు కెరియర్ పైనే దృష్టి పెట్టడంతో పెళ్ళికి నో చెప్పిందని, దీనితో ఒకరికి ఒకరు బ్రేకప్ చెప్పుకున్నట్టుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇవి నిజమా కదా తెలియాలంటే మాత్రం విష్నేష్, నయన్ లలో ఎవరో ఒకరు స్పందించక తప్పదు..
సినిమాలు..
గత ఏడాది చిరంజీవి సైరా, విజయ్ విజిల్ సినిమాలతో సందడి చేసింది నయన్.. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రజనీకాంత్ దర్బార్ సినిమాతో సందడి చేయనుంది. మురగదాస్
దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జనవరి 9 న విడుదల చేయనున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.