Jani Master: జానీమాస్టర్‌ను కస్టడీకి కోరనున్న నార్సింగ్ పోలీసులు

Jani Master: అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు కస్టడీకి కోరనున్నారు.

Update: 2024-09-21 06:16 GMT

Jani Master: జానీమాస్టర్‌ను కస్టడీకి కోరనున్న నార్సింగ్ పోలీసులు

Jani Master: అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను వెల్లడించారు. జానీ మాస్టర్ బాధితురాలిపై 2020 జనవరి 10వ తేదీన ముంబైలోని ఓ హోటల్‌లో అత్యాచారం చేసినట్లు గుర్తించారు.

దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా జాయిన్ చేసుకున్నాడని, నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి చేసినట్లు జానీ ఒప్పుకున్నాడని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. మరో వైపు షూటింగ్ స్పాట్‌లోనూ వ్యాన్‌లో పలుమార్లు అత్యాచారం చేశాడని, నిరాకరిస్తే తలను అద్దానికేసి కొట్టినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చిందన్నారు. మత మార్పిడి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసినట్లు బాధితురాలు చెప్పిందన్నారు పోలీసులు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడిందని రిమాండ్ రిపోర్టులో చెప్పారు పోలీసులు.

Tags:    

Similar News