Nani: ఓటీటీలో దుమ్మురేపుతోన్న 'సరిపోదా శనివారం'.. అరుదైన రికార్డు.. !
Saripodhaa Sanivaaram: నాని హీరోగా తెరకెక్కిన తెరకెక్కిన 'సరిపోదా శనివారం' సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Saripodhaa Sanivaaram: నాని హీరోగా తెరకెక్కిన తెరకెక్కిన 'సరిపోదా శనివారం' సినిమా ఏ రేంజ్‌లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆగస్టులో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లకుపైగా రాబట్టి నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం, నాని అద్భుత నటన ఈ ఈ సినిమా విజయతీరాలకు చేర్చింది.
ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. విడుదలైన రెండో రోజు నుంచే ఈ సినిమా దేశవ్యాప్తంగా టాప్ వన్‌లో ఉంది. నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు ఓటీటీలోనూ ఆదరణ లభిస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సూర్య (నాని)కి చిన్నప్పటింనుంచి కోపం ఎక్కువ. కొడుకు కోపాన్ని కంట్రోల్ చేసేందుకు గాను.. తన తల్లి చనిపోయే ముందు ఓ మాట తీసుకుంటుంది. ఎంత కోపం ఉన్నా కేవలం శనివారం మాత్రమే చూపించాలని మాట తీసుకుంటుంది. దీంతో వారమంతా తనకు ఎవరిపై కోపం వచ్చినా వారి పేర్లను రాసుకొని శనివారం ఒక్కరోజే కోపాన్ని చూపిస్తుంటాడు.
ఈ క్రమంలోనే నాని జాబితాలోకి సీఐ దయానంద్ (ఎస్ జె సూర్య) వచ్చి చేరుతాడు. ఇక సూర్య, దయానంద్‌ల మధ్య గొడవ ఎలాంటి మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో చారులత (ప్రియాంక మోహన్) ఎలా సహాయం చేస్తుంది.? అసలు సూర్యకు, చారులతకు అంతకు ముందే ఉన్న సంబంధం ఏంటి.? చివరికి ఏమైంది.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.