మళ్ళీ నిర్మాతగా మారనున్న నాని

దర్శకుడు అవుదాం అనుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా మారి ఆపై నిర్మాతగా మారాడు నాచురల్ స్టార్ నాని. హీరోగా మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న నాని 'డి ఫర్ దోపిడీ' అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు.

Update: 2019-01-25 06:11 GMT

దర్శకుడు అవుదాం అనుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా మారి ఆపై నిర్మాతగా మారాడు నాచురల్ స్టార్ నాని. హీరోగా మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న నాని 'డి ఫర్ దోపిడీ' అనే సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. తరువాత ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 'అ!' అనే సినిమాను స్వయంగా నిర్మించాడు నాని. ఇక ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తుండగా, మరో చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర వంశీ నిర్మిస్తున్నారు. అయితే త్వరలో సినిమాల నిర్మాణం పై కూడా దృష్టి పెట్టనున్నాడు నాని. ఈ ఇద్దరు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీళ్ళిద్దరి తో కలిసి సహ నిర్మాతగా ఇప్పుడు ఒక సినిమా చేయనున్నాడు నాని. ఆ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించనున్నారని తెలుస్తోంది. ఒకవైపు హీరో గానే కాక మరొకవైపు నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో మంచి పునాదులు వేసుకుంటూ వస్తున్నాడు నాని.

Similar News