Keerthy Suresh: స్నేహితుడు ఆంటోనితో లవ్.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే...

Keerthy Suresh: కీర్తి సురేశ్ ఆంటోనితో రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని ఆమె చెప్పారు.

Update: 2024-11-27 07:26 GMT

Keerthy Suresh

Keerthy Suresh: కీర్తి సురేశ్ ఆంటోనితో రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుందని ఆమె చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనితో దిగిన ఫోటోను ఆమె ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఈ పోస్టుపై నటి రాశి ఖన్నా స్పందించారు. కంగ్రాట్స్ లవ్ అని కామెంట్ పెట్టారు. ఇప్పుడే ఈ విషయం తెలుసుకున్నామన్నారు.

నేను శైలజతో సినిమాతో ఆమె తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. గీతాంజలి అనే మలయాళీ సినిమాతో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చారు. మహానటిలో సావిత్రి పాత్రలో ఆమె మెప్పించారు. ఈ సినిమాకు ఆమె జాతీయ అవార్డును స్వంతం చేసుకున్నారు.



కేరళలో పలు వ్యాపారాలున్న ఆంటోని విదేశాల్లో కొంత కాలం ఉద్యోగం చేశారని చెబుతున్నారు. కాలేజీ రోజుల నుంచి కీర్తి సురేశ్, ఆంటోని మధ్య స్నేహం ఉంది. రెండు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. గోవాలో వీరిద్దరి వివాహం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ పెళ్లి ఉంటుందని చెబుతున్నారు.కేరళలోని కొచ్చికి చెందిన ఆంటోనికి దుబాయ్ లో వ్యాపారాలున్నాయి. కేరళ, తమిళనాడులలో కూడా ఆయనకు వ్యాపారాలున్నాయి. సోషల్ మీడియాకు ఆంటోని దూరంగా ఉంటారు.

Tags:    

Similar News