Bigg Boss Telugu 8 Day 87: ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ.. నబీల్‌ చేసిన పనికి గట్టిగా ట్రోలింగ్‌..!

Bigg Boss 8 Telugu Day 87: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ చివరి దశకు చేరుకుంటోంది. దీంతో హౌజ్‌లో ఫైనల్‌కు చేరేది ఎవరన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.

Update: 2024-11-28 05:47 GMT

Bigg Boss Telugu 8 Day 87: ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ.. నబీల్‌ చేసిన పనికి గట్టిగా ట్రోలింగ్‌..!

Bigg Boss 8 Telugu Day 87: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ చివరి దశకు చేరుకుంటోంది. దీంతో హౌజ్‌లో ఫైనల్‌కు చేరేది ఎవరన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ టికెట్‌ టు ఫినాలే రేజ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ కంటెస్టెంట్స్‌ ఇంట్లోకి వచ్చి ఇంటి సభ్యులతో రకరకాల టాస్క్‌లను నిర్వహిస్తున్నారు. మంగళవారం మొదలైన ఈ టాస్క్‌లో అఖిల్‌, హారికలు వచ్చారు.

ఈ సందర్భంలో నిర్వహించిన గేమ్స్‌లో రోహిణి విజయం సాధించింది. దీంతో రోహిణి టికెట్ టు ఫినాలే రేసులోని మొదటి కంటెండర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే బుధవారం ఎసిసోడ్‌లో హౌజ్‌లోకి మానస్, ప్రియాంకలు ఎంట్రీ ఇచ్చారు. వీరు నిర్వహించిన టాస్క్‌లలో అవినాష్‌ గెలిచి రెండో కంటెండర్‌గా నిలిచాడు. ఇందులో భాగంగా స్కిల్, స్ట్రెంథ్ అనే వాటిని మానస్, ప్రియాంక ఎంచుకున్నారు.

తాము కంటెండర్‌గా ఎంచుకోవాలంటే ఎంటర్టైన్ చేయాలని అన్నారు. దాని కోసం మానస్, ప్రియాంక ఆటలు ఆడించారు. ఇందులో ప్రేరణ, నబిల్‌ను వారిద్దరూ ఎంచుకున్నారు. నబిల్, ప్రేరణ కలిసి అవినాష్, పృథ్వీల్ని లెక్కలు వేసుకుని మరీ ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే మొదట బిగ్‌బాస్‌ సుడోకు గేమ్‌ను పెట్టాడు. ఇందులో అందరు కంటెస్టెంట్స్‌ ఓడిపోయారు. అయితే బిగ్‌బాస్‌ హింట్‌ ఇవ్వడంతో అవినాష్‌ సుడోకులో విన్‌ అయ్యాడు.

నబీల్‌కు ట్రోలింగ్‌..

అయితే అంతకు ముందు సుడోకు గేమ్‌ మొదలు పెట్టిన క్షణాల్లోనే నబీల్‌ సుడోకు టాస్క్‌ను పూర్తి చేసేశా అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. గంట కొట్టేసి తెగ గంతులేశాడు. ఈ హడావుడి చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇంత త్వరగా టాస్క్‌ పూర్తి చేశాడా అంటూ ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే తీరా హౌజ్‌మేట్స్‌ అంతా వెళ్లి చూస్తే నబీల్‌ చేసిందంతా తప్పులతకడగా ఉంది. దీంతో అంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత అవినాశ్‌ టాస్క్‌లో గెలవగానే.. నబీల్‌ తట్టుకోలేకపోయాడు. 'అవినాష్ అంత తొందరగా పెట్టేశావ్.. ఎవరైనా హెల్ప్ చేశారా.. తేజ చెప్పాడా అంటూ' కామెంట్‌ చేశాడు.

ఇక స్కిల్‌ టెస్ట్‌ విషయానికొస్తే.. క్రికెట్‌ ఆడించారు. నబిల్‌కి నాలుగు బంతులు ఇవ్వగా.. 24 స్కోర్ చేశాడు. ప్రేరణ, పృథ్వీలు 30 రన్స్ చేశారు. అవినాష్ 8 బంతుల్లో 43 స్కోర్ చేసి విన్ అవుతాడు. దీంతో రెండో రెండో కంటెండర్‌గా అవినాష్ నిలిచాడు. నబిల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి రేసు నుంచి తప్పించేస్తారు. ఇలా బుధవారం ఎపిసోడ్‌ సాగంది. కాగా ఈ ఎపిసోడ్‌లో విష్ణుప్రియ కూడా హైలెట్‌గా నిలిచింది. విష్ణుప్రియ చెప్పిన బ్రేకప్‌ స్టోరీ కూడా తెగ ట్రెండ్ అవుతోంది. 

Tags:    

Similar News