Rashmika Mandanna About Pushpa 2 movie shooting: ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా అంత పుష్ప మేనియా కనిపిస్తోంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబోలో రాబోతున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా రష్మిక ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుపుతూ పలు విషయాలను ఆ పోస్టు ద్వారా పంచుకుంది.
డియర్ డైరీ నవంబర్ 25 నా జీవితంలో ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న రోజు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఈనెల 24న పుష్ప షూటింగ్ చేసుకుని చెన్నైలోని ఈవెంట్‌కు వెళ్లాం. అదే రోజు రాత్రి హైదరాబాద్ వచ్చాం. ఇంటికి వెళ్లి 4 నుంచి 5 గంటలు పడుకున్నా. తర్వాత రోజు ఉదయం లేచి పుష్ప సినిమాలో నా చివరి రోజు షూటింగ్‌కు వెళ్లాను. ఆ రోజు ఓ అద్భుతమైన సాంగ్ షూట్ చేశాం. పుష్ప సినిమాకు సంబంధించి నాకు అదే చివరి రోజు అని తెలుసు. కానీ ఏదో తెలియని బాధ. ఎందుకనేది ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. నా 7, 8 ఏళ్ల కెరీర్ లో గత 5 ఏళ్లు దాదాపు ఈ సినిమా సెట్లోనే ఉన్నాను. అయినా కూడా ఇంకా పని మిగిలే ఉంది. పార్ట్-3 ఉంది. అది వేరే విషయం.. కానీ దీనికి ఇదే లాస్ట్ డే.
"ఏదో తెలియని దుఃఖం. అన్ని ఎమోషన్స్ ఒకేసారి కలిసి వచ్చాయి. చాలా అలసిపోయాను. కానీ ఎంతో గర్వంగా కూడా ఉంది. గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడం, మనకు తెలియకుండానే వారితో బాండ్ ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్‌తో పాటు టీమ్‌తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. వారితో ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. పుష్ప సెట్ నాకు ఇల్లు లాంటిది. 2024 నవంబర్ 25 చాలా కష్టమైన రోజు. ఇది ఎంతో విలువైన రోజుగా ఉంటుందని కోరుకుంటున్నా" అని రష్మిక ఎమోషనల్ అయింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.