Bigg Boss Telugu 8: స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా రాణించిన యష్మీకి.. లభించిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Yashmi Gowda Remuneration: బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది. వారం వారం షో మరింత ఆసక్తికరంగా మారుతోంది.
Yashmi Gowda Remuneration: బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది. వారం వారం షో మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 12వ వారం అనూహ్యంగా యష్మీ హౌజ్‌ను విడాల్సి వచ్చింది. అప్పటి వరకు అవినాష్, విష్ణుపప్రియ అంటూ రకరకాల పేర్లు వినిపించినా హౌజ్‌లో మారిన పరిణామాల నేపథ్యంలో యష్మీ బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వకతప్పలేదు.
ఇదిలా ఉంటే సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార యష్మి.. బిగ్‌బాస్‌తో తెలుగు వారికి మరింత చేరువైంది. హౌజ్‌లో కూడా మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా రాణిస్తూ వచ్చింది. యష్మి ఆటతీరును చూస్తుంటే కచ్చితంగా టాప్5లోకి వస్తుందని అంతా భావించారు. కానీ తనకోసం కాకుండా ఎవరికోసమే గేమ్ ఆడుతుందన్న భావన ప్రేక్షకుల్లో బాగా పెరిగింది.
తొలి కంటెస్టెంట్ నిఖిల్ విషయంలోనే యష్మీ నెగిటివిటీ మూటగట్టుకుందని నెట్టింట అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి విష్ణుప్రియతో గొడవ కారణంగా ఓట్లు పడలేదన్న వాదన సోషల్ మీడియాలో నడిచింది. ఇలా యష్మీ ఎలిమినేషన్‌కు ఎన్నో కారణాలు చెప్పొచ్చు. అయితే ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ను అందించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే 12 వారాల పాటు హౌజ్‌లో ఉన్న యష్మికి బిగ్‌బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చాడన్న దానికి సంబంధించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సీరియల్స్‌తో నిత్యం బిజీగా ఉండే యష్మికి.. వారానికి రూ. 2.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా మొత్తం 12 వారాలకు కాను యష్మి సుమారు రూ. 30 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.