TFI Meets Revanth Reddy: రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి ఎందుకు రాలేదు?
TFI Meets Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) జరిగిన టాలీవుడ్ (Tollywood ) పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం సమావేశమయ్యారు.
TFI Meets Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (Revanth Reddy) జరిగిన టాలీవుడ్ (Tollywood ) పరిశ్రమకు చెందిన ప్రముఖులు గురువారం సమావేశమయ్యారు. ఈసమావేశానికి ప్రముఖ నటులు చిరంజీవి (Chiranjeevi ) దూరంగా ఉన్నారు. ఈ సమావేశం జరిగే సమావేశానికి చిరంజీవి చెన్నైలో ఉన్నారు. దీంతో ఈ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. ఈ సమావేశం గురించి ఎఫ్ డీ సీ (FDC) ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)) చిరంజీవికి సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికీ చిరంజీవి షెడ్యూల్ ఖరారైంది.
కొన్ని వివాహాలు, ఇతర ఫంక్షన్లకు సంబంధించి హాజరయ్యేలా చిరంజీవి తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి సినీ పరిశ్రమకు ఇచ్చిన సమయం చిరంజీవి చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే సమయం లేదని మెగాస్టార్ టీమ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమావేశానికి చిరంజీవి హాజరయ్యారు. అయితే తెలంగాణ ప్రభుత్వంతో నిర్వహించిన సమావేశానికి చిరంజీవి వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదు.
చిరంజీవి, అల్లు అర్జున్ కుటుంబాల మధ్య విబేధాలున్నాయని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఈ ప్రచారానికి తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్టైన రోజున బన్నీ ఇంటికి వెళ్లారు. జైలు నుంచి అర్జున్ విడుదలైన తర్వాత చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ ను పట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. వారం రోజుల క్రితం చిరంజీవి ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి అల్లు అర్జున్ వెళ్లారు. అదే రోజు సాయంత్రం నాగబాబు ఇంటికి వెళ్లారు.
రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశానికి చిరంజీవి రావాలనుకున్నప్పటికీ ఇతరత్రా షెడ్యూల్స్ కారణంగా ఆయన రాలేకపోయినట్టుగా ఆయన టీమ్ చెబుతోంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ముందు ఏ విషయాలను ప్రస్తావించాలనే దానిపై చిరంజీవి సినీ ప్రముఖులకు వివరించారని సమాచారం. సమావేశం వివరాలను సినీ పెద్దలు చిరంజీవికి చేరవేశారు.