Nagarjuna: చైతు, శోభితల పెళ్లి.. ఆ రూమర్స్‌పై సీరియస్ అయిన అక్కినేని నాగార్జున?
Naga chaithanya and Sobita Dhulipala wedding streaming rights: అక్కినేని నాగచైతన్య, శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరుకానున్నట్టు సమాచారం. అయితే చైతు, శోభిత పెళ్లికి సంబంధించి ఏదో వార్త తరచూ వార్తల్లో నిలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన వేడుకను స్ట్రీమింగ్ కోసం ఓటీటీకి ఇచ్చినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. దీనిని నాగార్జున ఆయన టీమ్ ఖండించినట్టు సమాచారం.
చైతు, శోభిత నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. పెళ్లి వేడుకకు సంబంధించి నయనతార-విష్నేష్లను ఫాలో అవుతున్నట్టు ప్రచారం జరిగింది. నాగచైతన్య, శోభిత వివాహ వేడుక ప్రసార హక్కులను ఓ ఓటీటీ ప్లాట్ పామ్ దక్కించుకుందని వార్తలు వినిపించాయి. నయనతార-విఘ్నేష్ వివాహ వేడుక డాక్యుమెంటరీ తర్వాత చైతన్య-శోభిత వివాహం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే రెండో సినీ ప్రముఖుల వివాహం కానుందంటూ టాక్ వచ్చింది.
నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్‌గా సిద్ధమైన ఆ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.25 కోట్లు నయనతార దంపతులకు చెల్లించింది. అయితే ఇప్పుడు ఇంతకు రెట్టింపు నాగచైతన్య, శోభిత వివాహ వేడుక ప్రసార హక్కుల కోసం చెల్లించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. నాగార్జున ఈ వార్తలు ఖండించినట్టు తెలుస్తోంది. ఇలాంటి ప్రసారాలు మానుకోవాలని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో వీరి పెళ్లి స్ట్రీమింగ్పై వస్తున్న వార్తలకు చెక్ పడింది.
ఇదిలా ఉంటే మరోవైపు అఖిల్, జైనభ్ రవ్జీల ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాగార్జున ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యామిటీ ఇంట వరుస శుభకార్యాలు జరుగుతుండడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబోయే వధువరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.