Best Web Series Of 2024: ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావడ లేదా.? నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది బెస్ట్‌ సిరీస్‌లివే..!

Best Web Series Of 2024 in Netflix: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కు అర్థమే మారిపోయింది.

Update: 2024-11-28 07:50 GMT

Best Web Series Of 2024 in Netflix: ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావడ లేదా.? నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది బెస్ట్‌ సిరీస్‌లివే..!

Best Web Series Of 2024 in Netflix: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కు అర్థమే మారిపోయింది. ఒకప్పుడు వారాంతం వస్తే థియేటర్లలో ఏ సినిమాలు వస్తున్నాయని న్యూస్‌ పేపర్లలో చూసుకునే వారు కానీ ప్రస్తుతం రోజులు మారాయి. మారిన టెక్నాలజీతో పాటు వినోదానికి అర్థం కూడా మారిపోయింది. ఓటీటీలకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. అయితే రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా అందుబాటులోకి వస్తున్న కంటెంట్‌లో ఏది చూడాలో అర్థం కాక కన్ఫ్యూజ్‌ అయ్యే పరిస్థితి కూడా నెలకొంది. మరి 2024 ఏడాది ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌లు, వాటి కథాంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* దక్షిణ కొరియాకు చెందిన వెబ్‌ సిరీస్‌లకు ఇండియాలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్‌ ఓటీటీ లవర్స్‌ ఎంతో ఇష్టంగా అక్కడి వెబ్‌ సిరీస్‌లను వీక్షిస్తున్నారు. ఈ కోవలోకే వస్తుంది ఏ కిల్లర్‌ పేరడక్ష్‌ అనే వెబ్‌ సిరీస్‌. 2024 ఫిబ్రవరి 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. లీ చాంగ్ హీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అనుకోకుండా మర్డర్‌ కేసులో ఇరుక్కున్న హీరోపై వరుసగా హత్యా ఆరోపణలు వస్తుంటాయి. ఇంతకీ ఆ హత్యలు ఎవరు చేస్తారు.? హీరోను ఆ కేసుల్లో వరు ఇరికించాలని చూస్తారు. చిరికి ఏమవుతుంది.? లాంటి అంశాలను 8 ఎపిసోడ్స్‌లో చూపించారు. ఇంగ్లీష్, కొరియన్, హిందీలో అందుబాటులో ఉంది.

* నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటోన్న మరో బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌లో 3 బాడీ ప్రాబ్లమ్‌ ఒకటి. గేమ్ అఫ్ త్రోన్స్ క్రియేటర్స్ డి.బి. వీస్, అలెగ్జాండర్ వూ రూపొందించిన ఈ సిరీస్‌ను.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు. వరుసగా జరుగుతోన్న శాస్త్రవేత్తల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దీని వెనకాల ఉన్న కారణం ఏంటన్న అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే ఈ సిరీస్‌ను కుటుంబంతో కలిసి చూడడం కష్టమనే చెప్పాలి. కారణం.. రొమాంటిక్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండడమే. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

* ఇక ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న మరో బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. చిన్నారులను ఆకట్టుకునే కంటెంట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. స్నో కింగ్‌డమ్‌, ఫైర్ కింగ్‌డమ్‌, ఎర్త్ కింగ్‌డమ్‌ ఇలా నాలుగు కింగ్‌డమ్స్‌ ఉంటాయి అవతార్‌ అనే కుర్రాడి కోసం ఫైర్ కింగ్డమ్ వెతుకుతూ ఉంటుంది. అతనిని వెతికి అంతం చేయాలని ఫైర్ కింగ్‌డమ పథకం వేస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే సన్నివేశాలు చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News