Dhanush – Aishwarya: హీరో ధనుష్-ఐశ్వర్యలకు విడాకులు మంజూరు
Dhanush – Aishwarya: హీరో ధనుష్, ఐశ్వర్య చట్టపరంగా విడిపోయారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వీరిద్దరూ రెండేళ్ల క్రితమే ప్రకటించారు.
Dhanush – Aishwarya: హీరో ధనుష్, ఐశ్వర్య చట్టపరంగా విడిపోయారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వీరిద్దరూ రెండేళ్ల క్రితమే ప్రకటించారు. అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. అయితే చట్టపరంగా విడిపోయేందుకు పరస్పర అంగీకారంతో ఈ ఏడాది విడాకుల కోసం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.నవంబర్ 27న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.
పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా ఇద్దరూ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం వేర్వేరుగా కోర్టుకు వెళ్తున్నారు. కొన్నేళ్లుగా తామిద్దరం విడిపోయి ఉంటున్నామని.. విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నామని కోర్టుకు తెలిపారు. కలిసి ఉండాలని అనుకోవడం లేదని తమ నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇరువురి వాదనలు విన్న చెన్నైలోని ఫ్యామిలి కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వీరు చట్టపరంగా విడిపోయినట్లు అయింది.
వీరికి ఇద్దరు పిల్లలు యాత్ర, లింగ. వీరి భవిష్యత్ పై ధనుష్, ఐశ్వర్య ఇద్దరు బాధ్యత తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పిల్లలతో ఇద్దరూ సమయం గడపాలని స్పష్టం చేసింది. కోర్టు విధించిన షరతులకు ధనుష్, ఐశ్వర్య అంగీకరించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య. హీరో ధనుష్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరు వైవాహిక జీవితం 15 ఏళ్లకు పైగా సాఫీగానే సాగింది. అయితే రెండేళ్ల క్రితం తాము విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే ధనుస్ ప్రస్తుతం ఓ వైపు హీరోగా వేరే దర్శకులతో సినిమాలు చేస్తూనే.. డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. కుబేర అనే సినిమా చేస్తున్నాడు.