Saripodhaa Sanivaaram: ఇట్స్‌ అఫిషియల్‌.. సరిపోద శనివారం ఓటీటీ డేట్‌ ఫిక్స్‌

ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిలం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ లిపింది.

Update: 2024-09-21 13:38 GMT

Saripodhaa Sanivaaram: ఇట్స్‌ అఫిషియల్‌.. సరిపోద శనివారం ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ 

నేచురల్ స్టార్‌ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సరిపోదా శనివారం మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దసరా, హాయ్‌ నాన్న వంటి సూపర్‌ హిట్ చిత్రాల తర్వాత నాని సరిపోదా శనివారంతో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు. ఆగస్టు 29వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

నాని, సూర్యల అద్భుత నటన వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ఇక ఈ చిత్రంలో నాని సరసన కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించి గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన చేసింది. సరిపోదా శనివారం సెప్టెంబర్‌ 29వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిలం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ లిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక సరిపోదా శనివారం సినిమా కథ విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే నానిని కంట్రోల్‌ చేసేందుకు తల్లి ఒక షరతు పెడుతుంది. కేవలం శనివారం మాత్రమే చూపిస్తానని తన తల్లికి మాటిస్తాడు. దీంతో వారం రోజుల్లో తనకు కోపం వచ్చిన వారందరి పేర్లను ఓ డైరీలో రాసుకొని కేవలం శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇందులో భాగంగానే నానికి.. సోకులపాలెం సీఐ దయానంద్ (ఎస్జే సూర్య)తో పరిచయం అవుతుంది. ఇయన ఒక శాడిస్ట్ పోలీస్‌ ఆఫీసర్‌. ఇంతకీ నానికి, సూర్యకి మధ్య వివాదం ఎందుకు వస్తుంది.? చివరికి ఆ గొడవ ఎలాంటి మలుపు తిరుగుంది.? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags:    

Similar News