Nandamuri Harikrishna: హరికృష్ణ వర్ధంతి... చంద్రబాబు, బాలయ్య ఎమోషనల్ పోస్ట్
Nandamuri Harikrishna: నటుడుగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు దివంగత నటుడు నందమూరి హరికృష్ణ.. అయన ద్వితీయ
Nandamuri Harikrishna: నటుడుగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు దివంగత నటుడు నందమూరి హరికృష్ణ.. అయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హరికృష్ణకి నివాళులర్పించారు. అయనతో ఉన్న అనుభందాలను గుర్తుచేసుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
"నందమూరి హరికృష్ణ గారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం. హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
నందమూరి హరికృష్ణగారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం. హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు pic.twitter.com/QgAla9NOs2
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 29, 2020
"చైతన్య రథసారధి, నటనలో రాజసం, ముక్కుసూటి వ్యక్తిత్వంతో అందరి అభిమానం చూరగొన్న హరి మావయ్య మాకు దూరమై నేటికి రెండేళ్లవుతోంది. రెండవ వర్థంతి సందర్భంగా హరిమావయ్య స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను." అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
చైతన్య రథసారధి, నటనలో రాజసం, ముక్కుసూటి వ్యక్తిత్వంతో అందరి అభిమానం చూరగొన్న హరి మావయ్య మాకు దూరమై నేటికి రెండేళ్లవుతోంది. రెండవ వర్థంతి సందర్భంగా హరిమావయ్య స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/lwVqBOpVpq
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 29, 2020
"తెలుగుదేశం స్థాపించిన తొలి దినాల్లో నాన్న గారికి చేదోడు వాదోడుగా ఉంటూ చెతన్య రథసారధి అయిన మా అన్న నందమూరి హరికృష్ణ గారు మన మధ్యనుంచి దూరం అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే నమ్మశక్యం కావటం లేదు మనస్సు అంగీకరించటం లేదు. నాన్నకు తగ్గ తనయుడు, తెలుగుదేశం పార్టీ తొలి శ్రామికుడు అన్నయ్య హరికృష్ణ గారికి నా నివాళులు అర్పిస్తూ... జోహార్ నందమూరి హరికృష్ణ" అంటూ బాలకృష్ణ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.