మరోసారి డైరెక్టర్ శ్రీవాస్ తో బాలకృష్ణ?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పైన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Update: 2020-11-29 13:02 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పైన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్త్హున్నాడు. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఎవరితో సినిమాని చేయనున్నరన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే తాజా సమాచారం మేరకు బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు శ్రీవాస్‌తో చేయబోతున్నారట. తాజాగా రైటర్‌ కోన వెంకట్‌ ఓ కథను బాలకృష్ణకు వినిపించగా, ఆ కథ బాలకృష్ణకి బాగా నచ్చడంతో నెక్ట్స్‌ మూవీగా చేద్దామని అన్నారట. ఈ సినిమాకి డైరెక్టర్‌ శ్రీవాస్‌ అయితేనే బాగుంటుందని బాలకృష్ణ సూచించారట. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది.

దీనికి ముందు బాలకృష్ణ, శ్రీవాస్ కాంబినేషన్ లో డిక్టేటర్ అనే సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్ననంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే మరోసారి ఈ కాంబినేషన్ రీపీట్ అయితే మాత్రం హిట్టవ్వడం ఖాయమని అంటున్నారు బాలయ్య అభిమానులు. 

Tags:    

Similar News