అజిత్ కోసం పోలీస్ గా మారనున్న నాగార్జున

Nagarjuna: తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న "వాలిమై" సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కాబోతోంది.

Update: 2022-02-02 01:45 GMT

అజిత్ కోసం పోలీస్ గా మారనున్న నాగార్జున

Nagarjuna: తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న "వాలిమై" సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 24న థియేటర్లో విడుదల కాబోతోంది. సినిమా పూర్తయిన తర్వాత అజిత్ వినోద్ మరియు బోనికపూర్ లతో ఒక సినిమా చేయబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఒక దొంగతనం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మార్చి 9 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో పోలీస్ కమిషనర్ పాత్రలో కనిపించాలని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పాత్ర కోసం మలయాళం మరియు తెలుగులో నటులను వెతికిన దర్శకనిర్మాతలు చివరికి నాగార్జున ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమాలో పోలీస్ కమిషనర్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండబోతోందని ఆ పాత్రలో నాగార్జున అయితే చాలా బాగుంటుంది అని దర్శక నిర్మాతలు విశ్వసిస్తున్నారు. పోలీస్ యూనిఫాం లో నాగార్జున ని చూసి ఇప్పటికే చాలా కాలం అయింది. దీంతో అభిమానులు కూడా ఈ సినిమాపై సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నాగార్జున మరియు మోహన్ లాల్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అదితి రావు హైదరి ని సంప్రదించనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Tags:    

Similar News