Bigg Boss 4 Telugu: సుమక్క సందడి..సండే బిగ్ బాస్ లో వినోదాల కేరింత!

Update: 2020-11-09 06:06 GMT

Bigg Boss 4 Telugu : ఆదివారం వచ్చిందంటే చాలు.. బిగ్‌ బాస్‌లో సన్ డే కాస్తా ఫన్ డే అయిపోతుంది. అయితే బిగ్‌ బాస్‌ షోని మరింత రసవత్తరంగా మార్చడానికి నిర్వహకులు కొత్త రకం స్ట్రాటేజీని అమలు చేశారు. కాస్త చప్పగా సాగుతోన్న షోలో హైప్‌ క్రియేట్‌ చేయడానికి బిగ్‌ బాస్‌ సర్ప్రైజ్ ఇస్తూ అందరిని ఫూల్స్ చేశాడు. సుమ ని వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ హౌస్ మేట్స్‌కి నాగ్‌ షాక్‌ ఇచ్చాడు. క‌ట్ చేస్తే 9వ వారం ఎలిమినేషన్‌లో బిగ్‌ బాస్‌ తన మార్క్‌ చూపించాడు. అరియానా ఏడ్చేసింది. ఎవరూ ఊహించని విధంగా అవినాష్ కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. అసలు షోలో ఈ ఏడుపులు ఎందుకు వినిపించాయి? అదివారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 4...64వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. బిగ్‌ బాస్‌ సన్ డే ఎపిసోడ్‌లో చాలా విశేషాలున్నాయి. దీపావళి బహుమతులు ఇవ్వడానికి ఇంటి సభ్యులతో నాగ్‌ కసరత్తు చేయించాడు. గిప్టు కావాలంటే టాస్కులు చేయాల్సిందేన‌ని ట్విస్ట్ ఇచ్చాడు. అయితే మాస్ట‌ర్‌కు చేప‌ల కూర‌, మోనాల్‌కు అహ్మ‌దాబాద్ నుంచి స్వీట్లు తెప్పించాడు. వాళ్ళిద్దరికి నాగ్‌ ఎందుకు గిఫ్టులు పంపించాడో ఇప్పుడు చూద్దాం.

మరి కొద్దిరోజులలో దీపావళి రానుండటంతో బిగ్ బాస్ హౌస్ కి కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున చెప్పాడు. అయితే ఆ గిఫ్ట్స్ దక్కాలంటే కొన్ని టాస్క్ లు పూర్తి చేయాలని నాగార్జున ఇంటి సభ్యులకు ఆదేశించారు. ఇచ్చిన టాస్క్ ఎవరు బాగా చేయగలరో వారిని నామినేట్ చేయాలని ఇంటి సబ్యులకు నాగార్జున చెప్పారు. ఈ గేమ్‌లో అభిజిత్, లాస్యకు నిరాశ ఎదురైంది. వారు ఎంచుకొన్న కంటెస్టెంట్లు నిర్ణీత సమయంలో గేమ్ పూర్తి చేయకపోవడంతో వారికి గిఫ్టులు లభించలేదు. ఇక అమ్మా రాజశేఖర్, మోనాల్‌కు ఎవరూ గిఫ్టులు పంపించకపోవడం వల్ల వారికి దీపావళీ కానుక లభించలేదు. అయితే ఆ ఇద్దరికి గిఫ్టులు నేను పంపిస్తున్నాను అంటూ నాగార్జున గిఫ్టులు పంపించారు.

ఫన్‌గా సాగిపోతున్న ఎపిసోడ్‌లోకి యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనడంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి పెరిగింది. సుమ ఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పడంతో ఇంటి సభ్యులు షాక్‌లో మునిగిపోయారు. అయితే సుమ ఎంట్రీపై చాలా మందిలో అనుమానాలు తలెత్తాయి. చివరికి ఆ అనుమానమే నిజమైంది. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఊరించిన బిగ్ బాస్ ఆఖరికి బొమ్మ చూపించాడు.

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో యాంకర్‌ సుమ అలరించింది. ఇంటి సభ్యులను అనుకరిస్తూ అందర్ని ఆటపట్టించింది. మధ్య మధ్యలో నాగార్జున వేసే పంచులకు ధీటుగా కామెంట్లు చేసింది. తన స్టయిల్‌ ఆఫ్‌ పంచులతో హౌస్‌లోని మెంబర్స్‌నే కాకుండా, హోస్ట్ నాగార్జునని, చూస్తున్న ప్రేక్షకులకి ఆమె ఎంటర్‌టైన్‌ చేసింది. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టబోతోందంటూ కలరింగ్‌ ఇచ్చిన బిగ్‌ బాస్‌ అంతా ఉత్తుత్తిదే అని ఫైనల్‌గా ప్రేక్షకులను ఫూల్స్‌ని చేసేశాడు. హౌస్‌లోకి వెళ్లినట్లే వెళ్లి సుమ వెంటనే బయటికి వచ్చేసింది. గంగవ్వ వయసు రాగానే లోపలికి వెళ్తానని అందరినీ నవ్వించింది. 'అయితే నెక్ట్ ఇయరే వెళ్తావన్న మాట అని నాగార్జున పంచ్ వేశారు.

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్‌లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ అత్యంత ఆసక్తిగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిదో వారానికి ప్రత్యేకత సంతరించుకొన్నది. ఈ వారంలో బిగ్‌బాస్ నిర్వాహకులు కొత్త రకం స్ట్రాటేజీని అమలు చేశారు. తొలిసారి ఓ కెప్టెన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హౌస్‌ నుంచి వెళ్లిపోయిన వ్యక్తి కెప్టెన్‌ బాధ్యతలను మరోకరికి అప్పగించాడు.

9వ వారంతంలో చివరి రోజున ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టి మోనాల్‌ను సేఫ్ చేయడంతో అవినాష్, అమ్మా రాజశేఖర్ మిగిలారు. వారిని బూత్‌లోకి పంపించి నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇంటి సభ్యులు బూత్ డోర్లు తీయగా ఇద్దరు కనిపించలేదు. దాంతో డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే అనుమానాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. నాగార్జున నోట డబుల్ ఎలినేషన్ మాట రావడంతో అరియానా షాక్ తిన్నది. అలా ఇద్దరు మాయమైన తర్వాత స్టోర్ రూమ్‌లో అవినాష్ ఏడుస్తూ కనిపించారు. దాంతో అందరూ అవినాష్‌ను ఓదార్చారు. ఇక బిగ్‌బాస్ నుంచి ఊహించిన విధంగానే అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. అమ్మ రాజశేఖర్‌ను వేదికపైకి పట్టుకొచ్చారు. వేదికపైకి వచ్చిన రాజశేఖర్‌‌కి మొదట ఆయన జర్నీని నాగార్జున చూపించారు. ఆ తరవాత నకిలీ - అసలు అనే టాస్క్ ఆడించారు. ఆ తర్వాత రాజశేఖర్‌ మాస్టర్‌ నిష్క్రమించాడు.

మొత్తంగా ఈ వారం బిగ్‌బాస్ ఆసక్తిగా సాగింది. ఆదివారం యాంక‌ర్ సుమ ఎంట్రీతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్‌ లభించింది. ఇక సోమ‌వారం నుంచి మ‌ళ్లీ నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కాబోతోంది. ఈ ద‌ఫా హౌస్ మ‌రింత హీటెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Tags:    

Similar News