కంటెస్టెంట్లకు ముచ్చెమటలు పెట్టించిన జలజ.. రెండోరోజు ఆర్జీవీ సాయం తీసుకున్న ..

Update: 2020-11-27 07:00 GMT

బిగ్‌ బాస్ నాల్గో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇంకా 24 ఎపిసోడ్లే మిగిలిఉన్నాయి. చివరి ఎపిసోడ్లను రసవత్తరంగా మలిచేందుకు బిగ్‌బాస్‌ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కొత్త కొత్త టాస్క్‌లను ప్రవేశపెడుతున్నాడు. ఉన్న 7గురు కంటెస్టెంట్లతోనే కావాల్సినంత మాజాని పిండేస్తున్నాడు. బిగ్‌బాస్‌ హౌస్‌ని స్మశానంలా మార్చేచాడు. ఎఫెక్ట్‌లు, స్పెష‌ల్‌ సౌండ్లతో కంటెస్టెంట్లకు వణుకుపుట్టించాడు. జలజ అనే దెయ్యాన్ని హౌస్‌లోకి పంపించి, కథ వేరుంటదని నిరూపించాడు బిగ్‌బాస్. మొన్న దెయ్యంపై జోకులేసిన ఇంటిసభ్యులు నిన్న భయపడ్డారో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటరైన జలజ.. ఫస్ట్‌ డే కంటెస్టెంట్లను పెద్దగా భయపెట్టించలేకపోయింది. కానీ సెకండ్‌ డే తన తడఖా చూపించింది. మీ అంతు చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చింది. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతానంటూ బెదిరించింది. దమ్ముంటే తానేం చేసినా భయపడకుండా నవ్వుతూ ఉండాలని చాలెంజ్‌ విసిరింది. కట్‌ చేస్తే ఇంటిసభ్యులు జలజ అంటేనే గజగజ వణుకుతున్నారు. ఇంతకీ జలజ ఏం చేసింది. వారంత జలజకు ఎందుకు భయపడుతున్నారు.

దెయ్యం జలజ ఇంటి సభ్యులకు ఓ లేఖ పంపించింది. తానేం ఏం చేయబోతున్నాను. ఇంటిసభ్యులు ఏం చేయాలని పెద్ద వివరణ ఇచ్చింది. ఇంటిసభ్యులు తినే అన్నం ప్లేట్లను తొలగించి, అరటి ఆకులను పంపించింది. ఇక నుంచి అందులోనే తినాలని ఆర్డర్ వేసింది. తాను భయపెట్టించినా భయపడకుండా నవ్వాలని చప్పట్లు కొట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దెయ్యం చెప్పినట్లుగా ఇంటి సభ్యులు అవినాష్‌ను ఎంచుకున్నారు. అవినాష్‌ ఒక్కడే గార్డెన్‌ ఏరియాలో లాంతర్ పట్టుకొని ఒంటరిగా కూర్చున్నాడు. అవినాష్‌ను భయపెట్టేందుకు స్పెషల్‌ ఎఫెక్ట్‌లు, సౌండ్స్ వాడింది జలజ. ఒంటరిగా ఉండడంతో అవినాష్‌లో కాస్త భయం మొదలైంది. తనకు తోడుగా ఎవరైన డోర్ వద్ద కూర్చోవాలని రిక్వెస్ట్ చేశాడు.

ఇక తెల్లవారుజామున 5గంటలకు జలజ ఏడుపుతో ఇంటిసభ్యులను నిద్రలేపింది. దీంతో ఇంటిసభ్యులు జలజ చెప్పినట్లు నవ్వుతూ చప్పుట్లు కొడుతూ ఉండిపోయారు. ఇక అవినాష్‌ కోసం డోర్‌ వద్దనే పడుకుంది అరియానా. ఇకమళ్లీ పడుకున్న ఇంటి సభ్యులను ఉదయం 8గంటలకు జలజ నిద్రలేపింది. మొదట అరుపులు, ఏడుపులతో హౌసంతా గోల పెట్టించింది. ఆ తర్వాత మంచి బీటున్న పాటను ప్లే చేశారు. దీంతో ఇంటిసభ్యులు నిద్రమత్తులోనే స్టెప్పులేశారు. వేకప్‌ సాంగ్ అయిపోగానే కంటెస్టెంట్లు గుడ్‌ మార్నింగ్‌ బిగ్‌ బాస్ అంటూ ఆ రోజుకు వెల్‌కం చెబుతుంటారు. కానీ ఈసారి సొహైల్‌ హౌస్‌ నుంచి ఎలిమినేషన్ అయిన మిత్రులందరికీ గుడ్‌ మార్నింగ్‌ చెప్పడం కొంచెం కొత్తగా అనిపించింది.

ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు జలజ మరో టాస్క్ ఇచ్చింది. మనుషుల టీం, దెయ్యం టీంలుగా కంటెస్టెంట్లను డివైడ్‌ చేసింది. హౌస్‌లో దాచిపెట్టిన చేయి, కాలు, పాప బొమ్మలను వెతికీ గార్డెన్‌ ఏరియాలో ఉన్న స్విమ్మింగ్‌ఫుల్‌ లో పడేయాలని ఆర్డర్ వేసింది. అయితే దెయ్యం టీం బొమ్మలను స్విమ్మింగ్‌ఫుల్‌లో వేయకుండా అడ్డుకోవాలని సూచించింది. అంతే కంటెస్టెట్లు కిందమీద పడి కొట్టుకున్నారు. జలజ నవ్వు వినగానే ఇంటిసభ్యులు ఆట మొదలుపెట్టేశారు. బొమ్మల వేటలో నిమగ్నమయ్యారు. అఖిల్‌కు మొదట చేయి బొమ్మ దొరికింది. దానిని తెలివిగా అరియానాను కిందపడేసి మరీ స్విమ్మింగ్‌ ఫుల్‌లోకి విసిరాడు.

మిగిలిన బొమ్మలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు అరియానా పెద్దసాహసమే చేసింది. కోతిపిల్ల చెట్టును పాకినట్లు పైకి పాకేసింది. అక్కడ బొమ్మ లేకపోవడంతో నిరుత్సాహంతో కిందకు దూకేసింది. పాప బొమ్మ మళ్లీ అఖిల్‌ కే కనిపించింది. దాన్ని దెయ్యం టీం కంటపడకుండా స్విమ్మింగ్‌ఫుల్‌ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు అఖిల్. కానీ అరియానా, అవినాష్‌ మనుషుల టీంను అడ్డుకున్నారు. అతికష్టం మీద బొమ్మను రెండు ముక్కలు చేసి బయటకు విసిరేశారు. మిగిలిన చేయి బొమ్మ కూడా అఖిల్‌ కంట పడింది. దానిని చాలా సులభంగా అఖిల్‌ స్విమ్మింగ్‌ ఫుల్‌లో పడేశాడు. మనుషుల టీం కేవలం రెండు బొమ్మలు వేసినందున ఎవరూ విన్‌ కానేట్లే అని అవినాష్ వాధించాడు. కానీ బిగ్‌ బాస్ మనుషుల టీం గెలిచినట్లు డిసైడ్‌ చేశాడు.

ఇక జలజ అసలు ఆట మొదలుపెట్టింది. ఇంటిసభ్యులను ఓ ఆట ఆడుకుంది. మీసం తిప్పి తొడకొట్టే మగవాళ్లను సైతం గజగజ వణికించింది. దెయ్యంతో పెట్టుకుంటే కథ వేరుంటుదని నిరూపించింది. టీవీలో బొమ్మ చూపించి దిమ్మ తిరేగేలా చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంటిసభ్యులకు ఆర్జీవీ తీసిన హార్రర్‌ మూవీని జలజ చూపించింది. మధ్య మధ్యలో మూవీని ఆపేసి భయం ఎలా ఉంటుందో రూచి చూపించింది. దీంతో ఇంటిసభ్యులు అరుపులు కేకలతో వణికిపోయారు.

ముందు అరియానా, అవినాష్‌ జలజకు బుక్కయ్యారు. స్మశానంలా మారిన కనెఫెక్షన్ రూంలోకి వెళ్లి చుక్కలు చూశారు. చిమ్మని చీకటిలో అడుగు ముందుకు వేయడానికి అరియానా గజగజ వణికిపోయింది. అవినాష్ ఎంత ధైర్యం చెప్పినా అరియానా సాహసం చేయలేకపోయింది. మళ్లీ సినిమా మొదలైంది. 12వ అంతస్తు మూవీలోని ఒక్కో సీన్‌ చూస్తూ కంటెస్టెంట్ల గుండెల్లో భయం నింపుకున్నారు. ఈసారి జలజ మోనాల్‌ ను ఎంచుకుంది. మొదట మోనాల్ పెద్ద ధైర్యశాలిలా బిల్డప్‌ ఇచ్చి లోపలికి ఎంటర్ అయ్యింది. లోపలికి వెళ్లాక మోనాల్‌ అసలు స్వరూపం బయటపడింది.

దెయ్యం అంటే అసలకే భయం లేదని బిల్డ్‌ప్‌ ఇచ్చిన సొహైల్‌ను జలజ ఏ రేంజ్‌లో ఆడుకుంది. భీకర సౌండ్స్‌తో గజగజలాడించింది. అయితే అమ్మాయిల ముందు పరువు పోతుందని అఖిల్, సొహైల్‌ భయాన్ని కవర్ చేస్తూ ఎట్టకేలకు చీకట్లో స్పూన్లను పసిగట్టారు. కానీ బయటకు వచ్చిన వాళ్లిద్దరు మాకేం భయం కాలేదంటూ ఫుల్ కవరింగ్ ఇచ్చారు. ఇక అఖిల్, సొహైల్‌ చాటుకు వెళ్లి తెగ భయపడిపోయారు. ఎవరికి తెలియనీయద్దని ఒకరికొకరు చెప్పుకున్నారు. ఈ సీన్‌ టెలికాస్ట్ చేయకూడదని బిగ్‌బాస్‌కి అఖిల్ రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ జరగాల్సిన తంతూ జరిగిపోయింది. మొత్తానికి జలజ ఎపిసోడ్‌ మంచి కామెడీని పండించింది. కావాల్సినంత కిక్ ఇచ్చింది. మరీ జలజ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకెన్ని రోజులు ఉంటుందో చూడాలి. 

Tags:    

Similar News