Naga Chaithanya Wedding Date: చైతూ - శోభిత మ్యారేజ్ డేట్ ఫిక్స్?

Update: 2024-10-29 08:56 GMT

Naga Chaithanya and Shobita Dhulipala wedding date: నాగచైతన్య, శోభిత పెళ్లి డేట్ ఫిక్సయింది. ఆగస్టు 8వ తేదీన వీరి నిశ్చితార్థం ఎంతో సింపుల్‌గా జరిగింది. అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని అక్కినేని అభిమానులకు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు డిసెంబర్ 4వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

ఆగస్టు 8వ తేదీన నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు లండన్‌లోని ఓ హోటల్‌లో వీరిద్దరూ డిన్నర్ డేట్‌కి వెళ్లిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఇరువురూ దీనిపై స్పందించలేదు. దీనికి తోడు శోభిత వల్లే నాగ చైతన్య, సమంతను వదిలేశాడంటూ వార్తలు వచ్చినా వాటిని కొట్టి పారేసే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత నిశ్చితార్థంలో అందర్ని ఆశ్చర్యపరిచారు ఈ జంట.

రీసెంట్‌గా శోభిత ధూళిపాళ్ల పసుపు దంచే ఫంక్షన్ కంప్లీట్ అయింది అంటూ చాలా ట్రెడిషనల్‌గా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. దీంతో నాగ చైతన్య, శోభిత పెళ్లి ఎప్పుడా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. డిసెంబర్ 4వ తేదీ నాగ చైతన్య, శోభిత మెడలో మూడు ముళ్లు వేయబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన అక్కినేని నాగేశ్వర రావు నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్‌లో ఈ విషయం బయటపడినట్లు సమాచారం.

డిసెంబర్ 2వ తేదీ సంగీత్, 3వ తేదీ మెహందీ, 4వ తేదీ పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌లో డిసెంబర్ 10వ తేదీ గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారని.. రిసెప్షన్‌కి మాత్రం అటు పొలిటికల్, ఇటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఇక అక్కినేని వారసుడి పెళ్లి డేట్ ఫిక్స్ అవడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారట అభిమానులు.

Tags:    

Similar News