Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి..
Naga Chaitanya: యువ హీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" అనే సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నారు.
Naga Chaitanya: యువ హీరో నాగచైతన్య తాజాగా ఇప్పుడు అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" అనే సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగచైతన్య తన వ్యక్తిగత విషయాల గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య తన టాటూ వెనుక ఉన్న అర్ధాన్ని వివరించారు. తన అభిమానులు తానేం చేస్తే అది ఫాలో అవుతూ ఉంటారని అలానే తాను వేయించుకున్న టాటూ ని కూడా వాళ్ళు కాపీ చేస్తున్నారని కానీ అసలు ఈ టాటూ వెనుక ఉన్న అర్థం తెలిస్తే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు అని అన్నారు నాగచైతన్య.
ఇంతకీ టాటూ వెనక అర్థం ఏంటి అని అడగగా తన పెళ్లి తేదీని మోర్స్ కోడ్ రూపంలో వేయించుకున్నాను అని చెప్పుకొచ్చారు నాగచైతన్య. అయితే ఇప్పుడు సమంతా నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. మరి అయినా సరే టాటూ తీయించుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా అని అడగగా నాగచైతన్య లేదని జవాబు ఇచ్చారు.