Oscars 2023 Updates: ఆస్కార్ వేడుకలో "నాటు నాటు" ప్రదర్శన
Oscars Awards 2023: అమెరికా లాస్ ఏంజెల్స్ వేదికగా ఆస్కార్ అవార్డ్స్
Oscars 2023 Updates: ప్రతిష్టాత్మిక ఆస్కార్ అవార్డు వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీని తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ వేడుకలకు ట్రిపుల్ ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా రెడీ అయి వచ్చారు. అమెరికాలోని లాస్ ఏంజెన్స్ వేదికగా జరుగుతోన్న ఈ వేడుకలకు ఈ ఇద్దరు హీరోలు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు. ఈ వేడుకలకు చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వచ్చాడు.
దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ, 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ఆస్కార్ అవార్డులకు వెళ్లారు. నాటు నాటు పాటతో అదరగొట్టేసిన సింగర్లు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వేదికకు చేరుకున్నారు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఆస్కార్ అవార్డు వేడుక స్టార్టింగులో కొందరు డ్యాన్సర్లు 'నాటు నాటు...' స్టెప్పులు వేశారు. ఇక ఆస్కార్ వేడుకల్లో పలు విభాగాలకు అవార్డులు ప్రకటిస్తున్నారు. యానిమేషన్ ఫీచర్ విభాగంలో గుల్ర్మో డెల్ టోరో తీసిన 'పినోకియో' అవార్డు అందుకుంది. 95వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటుడిగా కె. హుయి క్వాన్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు 85 ఏళ్ళ తన తల్లి లైవ్ చూస్తుందని, ఈ అవార్డు ఆమెకు అంకితమని ఆయన చెప్పారు. ఉత్తమ సహాయ నటి విభాగంలో ఈ ఏడాది జామీ లీ కర్టిస్ అవార్డు అందుకున్నారు. 'ఎవిరీథింగ్ ఎవిరీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు పురస్కారం అందుకున్నారు.