Gangavva: వార్నీ.. గంగవ్వకు ఇంత ఆస్తి ఉందా.? రూ. కోటి పైమాటే..!

Gangavva: గంగవ్వ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరికీ ఈమె గురించి తెలిసే ఉంటుంది.

Update: 2024-09-12 08:30 GMT

Gangavva: వార్నీ.. గంగవ్వకు ఇంత ఆస్తి ఉందా.? రూ. కోటి పైమాటే..!

Gangavva: గంగవ్వ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరికీ ఈమె గురించి తెలిసే ఉంటుంది. మలి వయసులో ఊహించని విధంగా సెలబ్రిటీగా మారింది గంగవ్వ. కరీంనగర్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సుపరిచితురాలిగా మారింది. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా కోట్లాది మందికి చేరువైంది.

ఇక బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా ఊహించని రీతిలో సెలబ్రిటీ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలను కూడా సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ నెటిజన్లకు వినోదాన్ని పంచుతోంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ తర్వాత గంగవ్వ జీవితం పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు చిన్న పెంకుటిల్లులో ఉన్న గంగవ్వ ఇప్పుడు పెద్ద బంగ్లా నిర్మించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మై విలేజ్‌ షో టీమ్‌ గంగవ్వ ఆస్తులకు సంబంధించిన ఓ వీడియోను రూపొందించింది.

ఇందులో తన జీవితం బిగ్‌బాస్‌ తర్వాత ఎలా మారిందన్న వివరాలను తెలియజేసింది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన గంగవ్వ తనకు ఉన్న స్థలంలో రూ. 22 లక్షలతో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిపింది. ఇక ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా వేసినట్లు పేర్కొంది. అలాగే వాటి కోసం గడ్డిని కూడా పెంచుతోంది. షెడ్డు నిర్మాణానికి రూ. 3 లక్షల ఖర్చయినట్లు తెలిపింది.

ఇక రూ. 9 లక్షలతో నాలుగున్నర గుంటల పొలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చింది. అలాగే మరో చోట తన పేరు మీద రెండున్నర ఎకరాలు ఉన్నట్లు తెలిపింది. దీని విలువ సుమారు రూ. 80 లక్షల వరకు ఉంటుందంటా. అలాగే వీటితో పాటు రూ. 3 లక్షల విలువైన మరో ప్లాట్‌ కూడా ఉందని గంగవ్వ చెప్పుకొచ్చింది. అలాగే రూ. 8 లక్షల విలువైన మరో 15 గంటల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు తెలిపింది. ఇలా మొత్తం మీద అన్ని కలుపుకుంటే గంగవ్వ ఆస్తుల విలువ ఎంత కాదన్న రూ. కోటిన్నర వరకు ఉండొచ్చన్నమాట. ఇక ఏం చేస్తాంలే అనుకున్న వయసులో గంగవ్వ జీవితం మారిపోడం నిజంగానే ఎంతో మందికి ఆదర్శం కదూ. అయితే ఎప్పటికైనా 50 ఆవులను కొని, వాటిని పెంచుతూ, పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది.

Full View


Tags:    

Similar News