తన ప్రాణ స్నేహితుడు బాలుకి ఇళయరాజా నివాళి!

Musician Ilayaraja : మెస్ట్రో ఇళయరాజా, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంల స్నేహబంధం గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇళయరాజా పాటలను ఎక్కువగా ఎస్పీ బాలు పాడడం విశేషం..

Update: 2020-09-27 06:39 GMT

Ilayaraja 

Musician Ilayaraja : మెస్ట్రో ఇళయరాజా, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంల స్నేహబంధం గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇళయరాజా పాటలను ఎక్కువగా ఎస్పీ బాలు పాడడం విశేషం.. అయితే తన ప్రాణ స్నేహితుడు తనని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఇళయరాజా చాలా బాధపడ్డారు.. నేను లేచి రమ్మని పిలిచినా బాలు వినిపించుకోలేదంటూ ఇళయరాజా తన దుఃఖాన్ని వెలిబుచ్చారు.. అయితే తన స్నేహితుడకి అంజలి ఘటిస్తూ ఇళయరాజా ఓ స్మృతి గీతాన్ని కంపోజ్ చేశారు. బాలు అంత్యక్రియలు తర్వాత ఇళయరాజా తిరువణ్ణామలై గుడిని సందర్శించి అక్కడ దీపాన్ని వెలిగించి నివాళులు అర్పించారు.

నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.

కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా మెప్పించారు. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 16 భాషలలో పాటలు పాడారు.. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు కూడా ఉంది. ఇక ఎస్పీ బాలు గత కొద్దిరోజులుగా చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ( సెప్టెంబర్ 25) న మృతి చెందారు. నిన్న చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి. 

Tags:    

Similar News