సోనూసూద్ పై సంచలన ఆరోపణలు చేసిన ముంబయి మున్సిపాలిటీ అధికారులు
సోనూసూద్ ముంబై లో అక్రమ నిర్మాణాలు చేపట్టడని ఆరోపిస్తూ ముంబై నగరపాలక సంస్థ కోర్టుకు చెప్పడం అందరినీ షాక్ కు గురిచేసింది.
లాక్ డౌన్ వేళ నటుడు సోనూసూద్ కష్టాల్లో ఉన్నవారికి ఎన్నో సేవాకార్యక్రమాలు రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాక్ డౌన్ తరవాత సైతం ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న సేవలకు గానూ సాధారణ ప్రజలే కాకుండా ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. దాంతో ఆయన మంచి తనాన్ని కొనియాడారు.
ఇదిలా ఉండగా సోనూసూద్ ముంబై లో అక్రమ నిర్మాణాలు చేపట్టడని ఆరోపిస్తూ ముంబై నగరపాలక సంస్థ కోర్టుకు చెప్పడం అందరినీ షాక్ కు గురిచేసింది. సోనూసూద్ తమ నివాసంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిస్తూ నగరపాలక సంస్థ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సివిల్ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్ట్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టులో సోనూ సూద్ వేసిన అప్పీల్ కు సమాధానంగా ముంబయి నగరపాలక సంస్థ సమర్పించిన అఫిడవిట్ లో సోనూ సూద్ నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తీ అనీ, ముంబై లోని జుహూ నివాసిత ప్రాంతంలో అతడు అక్రమాలకు పాల్పడ్డాడని ఆ కట్టడాలను కూల్చివేసినా తీరు మార్చుకోలేదని పేర్కొంది. ఇప్పుడు ముంబయి మున్సిపాలిటీ అధికారులు చేసిన ఆరోపణల పై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది.