Raj Kundra: పోర్న్ సినిమాల కేసులో రాజ్‌కుంద్రా జైలు నుంచి రిలీజ్
* ఆర్ధర్ రోడ్డు జైలు నుంచి విడుదల అయిన రాజ్‌కుంద్రా * రూ.50వేల ష్యూరిటీతో ముంబైకోర్టు బెయిల్ మంజూరు
Raj Kunda: పోర్న్ సినిమాల కేసులో రెండు నెలల క్రితం అరెస్టయిన వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా జైలు నుంచి విడుదల అయ్యారు. ఈకేసులో 50వేల ష్యూరిటీతో ముంబైకోర్టు ఆయనకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. లాంఛనాలు పూర్తి చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గ్రహణం వీడితే మళ్లీ మంచిరోజులు వస్తాయనడానికి సంకేతమే ఇంద్రధనస్సు అంటూ శిల్పాశెట్టి ట్వీట్ చేశారు.