సినీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్‌

Update: 2021-02-11 15:22 GMT

లాక్‌డౌన్‌తో మూతపడ్డ సినీ థియేటర్లు ఇటీవలే తెరుచుకున్నాయి. కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కరోనా మహమ్మారి ఒకపక్క భయపెడుతున్నా సినీ అభిమానులు థియేటర్లకు క్యూకట్టారు. యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకున్నా తమ అభిమాన హీరోల సినిమాలకు బ్రహ్మరథం పట్టారు. ఇక, హీరోలతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరించి ఘనవిజయం కట్టబెట్టారు. కరోనా దెబ్బకు మూలనపడ్డ సినీ పరిశ్రమకు మళ్లీ ఊపిరిలూదారు. కరోనా కాలంలో సైతం ఈ స్థాయిలో సినిమాలను ఆదరిస్తూ కనకవర్షం కురిపిస్తుంటే సినీ అభిమానులు, ప్రేక్షకులపై మాత్రం బడా నిర్మాతలు పెనుభారం మోపుతున్నారు.

కరోనా కష్టకాలమనే కనికరం కూడా లేకుండా ఇష్టారాజ్యం టికెట్ల రేట్లను పెంచేసి ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దాన్నే ఆసరాగా తీసుకుంటున్న పెద్ద నిర్మాతలు పెద్ద సినిమాల పేరుతో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారు. దాంతో, ఓ మాదిరి థియేటర్లతోపాటు మల్టీ ఫ్లెక్సుల్లో టికెట్‌ రేట్‌ అమాంతం పెరిగి 350 రూపాయలకు చేరింది. దాంతో, సినీ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే వేల రూపాయలు వదిలించుకోవాల్సిందే అంటున్నారు. ఇదిలాఉంటే, సినీ థియేటర్లలో మళ్లీ పార్కింగ్ ఫీజు వసూలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని, అది కూడా పెద్దమొత్తంలోనే ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. అయితే, ఇలా, సినీ అభిమానుల జేబులను గుల్లచేస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తారని హెచ్చరిస్తున్నారు.

Full View


Tags:    

Similar News