Assembly Elections: గెలిచిన, ఓడిన సినీతారలు వీరే
Assembly Elections: ఇక ఈ ఎన్నికల్లో పలువురు నటీనటులు పోటీచేశారు.
Assembly Elections: ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి అందరి ఆసక్తి బెంగాల్ పైనే ఉంది. బెంగాల్ లో మమతా పార్టీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో డిఎంకే విజయకేతనం ఎగరవేసింది. కేరళ అయితేపినరయి విజయన్ మళ్ళీ అధికారం చేపట్టారు. ఆసోం, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అధికారం చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీలే హస్తగతం చేసుకున్నాయి. ఏపీలోని తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ, నాగార్జున సాగర్ అసెంబ్లీని టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఎన్నికల్లో పలువురు నటీనటులు పోటీచేశారు. సురేశ్ గోపీ, ఖుష్బూ, ఉదయనిధి స్టాలిన్, కమల్ హాసన్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో ఓడిన వారు గెలిచిన వారెవరో తెలుసుకుందాం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న నామ్ తమిళర్ కట్చి నేత, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ తిరువొత్తియూరు నుంచి ఓటమి పాలయ్యారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్(బీజేపీ)పై స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్ గోపీ ఓడిపోయాడు. త్రిస్సూర్ నియోజకవర్గంలో మొదట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. డీఎంకే పార్టీకి కంచుకోట అయిన చెపాక్ నియోజకవర్గంనుంచి దాదాపు 60 వేల మెజార్టీతో గెలుపొందారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటి ఖుష్బూ ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు. సయాఠీకా బెనర్జీ పచ్ఛిమ బెంగాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.