Movie Shooting In Vizag : విశాఖ బీచ్ రోడ్డులో షూటింగ్ సందడి!
Movie Shooting In Vizag : లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి.. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్లు
Movie Shooting In Vizag : లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి.. సినిమా షూటింగ్ లు ఆగిపోవడం, ధియేటర్లు కూడా బంద్ అయిపోవడంతో ఇండస్ట్రీ కొన్ని కోట్ల నష్టం అయితే చూసిందని చెప్పాలి. అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చింది. అందులో భాగంగానే విశాఖలో మళ్ళీ సినిమా షూటింగ్ ల సందడి మొదలైంది. విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో శుక్రవారం సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు.
మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే చిత్ర యూనిట్ షూటింగ్ లో పాల్గొంది. ఈ షూటింగ్ ని చూసేందుకు విశాఖ నగర ప్రజలు బీచ్‌రోడ్డుకు తరలివచ్చారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 'ఐపీఎల్' పేరుతో రూపొందిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్. లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నగరంలో మొదలయి మళ్ళీ పాత రోజులను గుర్తు చేశాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇక అటు ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రములో కేసులో అంతకంతకు పెరుగుతున్నాయి.. శుక్రవారం సాయింత్రం నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో 10,776 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 59,919 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,776 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 12,334 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 4,76,506 కి చేరుకుంది. ఇందులో 1,02,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి.