Mothers Day 2021: తెలుగులో వచ్చిన 'అమ్మ' పాటలు
Mothers Day 2021: అమ్మ ప్రేమ స్వార్థం లేనిది. ఢిల్లికి రాజైనా తల్లికి కొడుకే అని అంటారు.
Mothers Day 2021: అమ్మ ప్రేమ స్వార్థం లేనిది. ఢిల్లికి రాజైనా తల్లికి కొడుకే అని అంటారు. మహిళలకు మాతృత్వపు మాధుర్యాన్ని మించిన ఆనందం, ఆస్తి మరొకటి ఉండదు. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకునే గొప్ప ఔదార్యత ఒక తల్లికే సాధ్యం. అమ్మ గురించి, అమ్మ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు మరో సందర్భం మాతృ దినోత్సవం. తెలుగు సినిమాల్లో అమ్మ గురించి చెప్పే పాటలు ఎన్నో వచ్చాయి. వాటిలో కొన్ని మీ కోసం.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జయరాజ్ అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా.. స్వర కోకిల యస్.జానకి, కె.జె.ఏసుదాసు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
తరిగిపోని నా తీపి కలలని
తిరిగిరాని నా చిన్నతనముని నీ రూపంలో చూస్తూ ఊన్నా..
ఈ పరుగు ఇంక ఎంతసేపురా
ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
నా గారాల మారాజ కాస్త ఆగరా. అంటూ సాగే చరణం అద్భుతంగా రాశారు రచయిత.