Bigg Boss Fraud: బిగ్‌బాస్ పేరిట మోసం.. షోలో ఛాన్స్ ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు వసూళ్లు

Bigg Boss Fraud: మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Update: 2024-01-23 07:17 GMT

Bigg Boss Fraud: బిగ్‌బాస్ పేరిట మోసం.. షోలో ఛాన్స్ ఇప్పిస్తానని లక్షల్లో డబ్బులు వసూళ్లు

Bigg Boss Fraud: బిగ్ బాస్ షోలో అవకాశాల పేరిట డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న తమ్మలి రాజు అనే వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బిగ్ బాస్ షోలో అవకాశం పేరిట స్వప్న అనే మహిళ నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేశాడు. యాంకరింగ్ వృత్తిలో కొనసాగుతున్న స్వప్నకు బిగ్‌బాస్‌లో అవకాశం పేరిట మోసానికి తెరలేపాడు రాజు. స్వప్నను బిగ్‌బాస్‌లోకి పంపించకపోయినందుకు.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే గడువు లోగా డబ్బు చెల్లించకపోతే.. నెలనెలా వడ్డీ చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు.

ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చంటూ అగ్రిమెంట్‌లో రాసి సంతకం చేశాడు. అయితే డబ్బుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అటు మరికొందరి దగ్గర కూడా వేలల్లో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో బిగ్‌బాస్ అవకాశాల మోసం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News