Raithanna: అన్నదాత పడుతున్న కష్టాలను "రైతన్న"గా చూపిస్తా
Raithanna: చిత్ర విశేషాలను వివరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి * దేశంలో నెలకొన్న రైతుల ఇబ్బందులపై చిత్రం
Raithanna: నటుడు ఆర్. నారాయణమూర్తి రూపొందించిన రైతన్న చిత్రం విడుదల సందర్భంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. రైతులు, వారి శ్రేయస్సు కోసం రైతన్న చిత్రాన్ని నిర్మించారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తిని ప్రజలు, రైతు పక్షపాతిగా అభివర్ణించారు.
గత 36 ఏళ్లుగా ప్రజ సమస్యలు, రైతు సమస్యలపై పలు సినిమాలు రూపొందించిన నారాయణమూర్తి ప్రస్తుతం దేశంలో గత 8 నెలలుగా నెలకొన్న రైతాంగ ఉద్యమంపై రైతన్న చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల అన్నదాత పడుతున్న తీవ్ర ఇబ్బందులను ఈ చిత్రంలో పొందుపరిచారు. రైతన్న చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.