2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను'సినిమా అందరికే గుర్తుండే ఉంటుంది. అందులో ఉదయ్ కిరణ్ కి జోడిగా అనిత నటించింది. సినిమా మంచి హిట్టు కావడంతో అనితకి చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అనిత కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించారు.. అంతేకాదు ప్రస్తుతం కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా నటిస్తుంది అనిత..
ఇక ఇది పక్కన పెడితే ప్రస్తుతం అనిత తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి 'నాచ్ బలియే 9' డ్యాన్స్ షోలో పోటీపడుతున్నారు. 'రోనిత' పేరుతో ఈ జోడి కంటెస్ట్ నడుస్తుంది. ఈ షోకి రవీనా టాండన్, అహ్మద్ ఖాన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో 'రోనిత' జంట ఫైనల్కు చేరుకుంది. వీరితో పాటు మరో నాలుగు జంటలు కూడా ఫైనల్కు చేరాయి.
అయితే ఇందులో 'రోనిత' జంట గెలవాలంటే ప్రేక్షకుల ఓటింగ్ అనేది కీలకం అన్నమాట.. అయితే ఆమెకి సపోర్ట్ గా నిలిచి ఆమెను విజేతను చేయాలనీ తెలుగు ప్రేక్షకులను కోరాడు ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్..
PLEASE VOTE FOR RONITA 🙏🏻
— Meher Ramesh (@MeherRamesh) October 28, 2019
Anita and Rohit !!! ❤❤
Nach Baliye #Ronita have made it to the finale
Anita Nuvvunennu fame.
Shower Love!! Just one missed call on this number will do the trick: 1800120888807
Simply a missed call!! pic.twitter.com/QPcyFAVWH1