Chiranjeevi & NTR: ఒకే దారిలో వెళ్తున్న చిరు, తారక్..!

Chiranjeevi & NTR: తన తదుపరి చిత్రం ఆచార్య షూటింగ్‌లో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి విశ్రాంతి తీసుకున్నారు.

Update: 2021-05-06 12:23 GMT

చిరంజీవి, తారక్ (ఫొటో ట్విట్టర్)

Chiranjeevi & NTR: తన తదుపరి చిత్రం ఆచార్య షూటింగ్‌లో ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి విశ్రాంతి తీసుకున్నారు. బయట పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు సినిమా షూటింగ్ ప్రారంభించకూడదని చిరు నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ తదుపరి సినిమాలు కూడా ఆలస్యం కానున్నాయి.

చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్‌పై సంతకం చేశాడు. దాని కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ, కోవిడ్ కారణంగా ఈ చిత్రాన్ని ఆపాలని చిరంజీవి నిర్మాతలను కోరినట్లు సమాచారం.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈలోపు తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ షోను ప్రారంభించాల్సి ఉంది. కానీ, దాని పనులు కూడా వాయిదా పడ్డాయని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివతో చేయనున్నాడు. ఈ సినిమా కూడా నిలిచిపోయిందని తెలుస్తోంది.

నటీనటులు ఇద్దరూ కూడా తమ కొత్త ప్రాజెక్టులను ప్రస్తుతం ప్రారంభించేలా లేరు. మరోవైపు కొంతమంది హీరోలు మాత్రం పలు సినిమాల షూటింగ్‌లలో బిజీగా మారారు.

Tags:    

Similar News