IIFA 2024: గ్రాండ్‎గా ఐఫా వేడుక.. మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

IIFA 2024:ఐఫా అవార్డుల వేదిక కన్నుల పండువగా జరుగుతోంది. ఈ వేడుక అబుదాబి వేదికగా గ్రాండ్ గా జరుగుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. పూర్తి వివరాలు చూద్దాం.

Update: 2024-09-28 02:37 GMT

 IIFA 2024: ఐఫా అవార్డులు...సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇప్పుడు ఈ ఐఫా అవార్డుల పండగ అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్లో రెండో రోజు సమంత, రానా, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ సందడి చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్లు పలు జాబితాల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు.  ఈ వేడుకల్లో చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఔట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు. ప్రముఖ పాటల రచయిత  జావెద్ అక్తర్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు.వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సమంత గెలుచుకున్నారు.

ఈమధ్యే మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కెరీర్ లో 156 సినిమాలు, 537 పాటలు 24వేల స్టెప్పులతో అభిమానులను అలరించినందుకు గిన్నిస్ బుక్ లో ఆయనకు చోటు దక్కింది. తాజాగా చిరంజీవి మరోసారి ఔట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారంతో ఐఫా ఆయన్ను సత్కరించింది.


ఐఫా అవార్డుల పండగా అబుదాబీ వేదికగా శుక్రవారం  మొదలైంది. . దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News