Chiranjeevi Participated in Green india Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చిరు, ప‌వ‌న్‌లు

Chiranjeevi participated in Green india Challenge: ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రిర‌క్షించాల‌నే ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యుడు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప‌లువురు ప్ర‌ముఖులు, సినీ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు.

Update: 2020-07-26 11:18 GMT
Megastar Chiranjeevi, pawan participated in Green india Challenge

Chiranjeevi Participated in Green india Challenge: ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రిర‌క్షించాల‌నే ఉద్దేశ్యంతో రాజ్యసభ సభ్యుడు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప‌లువురు ప్ర‌ముఖులు, సినీ సెలెబ్రిటీలు మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమం రోజురోజుకీ మహా ఉద్యమంలా కొనసాగుతుంది. కేవ‌లం వారు ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించ‌డ‌మే కాదు.. ఇత‌రులకు కూడా మొక్క‌లు నాటేలా ప్రోత్స‌హిస్తున్నారు. 

తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబ్లిహిల్స్‌ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో.. జూబ్లీహిల్స్‌ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టా‌ర్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బోయపాటి శ్రీను అనిల్, రావిపూడి వంటి వారు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అందరూ మొక్కలు నాటారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో వేదికగా ఎమోషనల్ అయ్యాడు. 'ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని నా వంతుగా చిన్న పాత్రను నిర్వర్తించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సంతోష్ గారిని కోరుతున్నానని అనిల్ రావిపూడి తెలిపాడు.

మ‌రోవైపు, ఈ భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన సవాల్ స్వీకరించి హీరో అల్లరి నరేష్ ఫిలింనగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమవుతామని చెప్పారు. హీరో నాని, సింగర్ స్మిత, డైరెక్టర్ దేవా కట్ట ముగ్గురికీ సవాల్ విసురుతున్నట్లు పేర్కొన్నారు అల్లరి నరేష్. ఇప్పటికే ఉప్పెన టీమ్, హీరోయిన్లు రష్మీక, రాశీ, రకుల్ వంటి వారంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. 


Tags:    

Similar News