Chiranjeevi: వేదాళం తెలుగు రీమేక్ : డైరెక్టర్ మారిపోయాడు?

Chiranjeevi: గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో

Update: 2020-08-31 06:06 GMT

Chiranjeevi, Ajith 

Chiranjeevi: గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ఆచార్య తరవాత చేయబోయే చిత్రాలకి సంబంధించిన కథలను వింటున్నట్టుగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే..అందులో భాగంగానే మలయాళం మూవీ 'లూసీఫర్' రీమేక్ లో నటిస్తున్నట్టుగా చిరంజీవి వెల్లడించారు. అయితే ఈ సినిమా కంటే ముందు తమిళ్ లో మంచి హిట్ అయిన వేదాళం రీమేక్ లో చిరు నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.. 2015లో అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అయింది.. ఇందులోని అజిత్ మాస్ రోల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ రోల్ తనకి బాగా సూట్ అవుతుందని భావించిన చిరు ఈ రీమేక్ లో చేసేందుకు సిద్దం అయ్యారట..

అయితే ఈ మూవీని దర్శకుడిగా ఫెడ్ అవుట్ అయిపోయిన మెహర్ రమేష్ ను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి.. అయితే ఇప్పుడు మెహర్ రమేష్ స్థానంలో మాస్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ అయితే బెటర్ అనుకోని దర్శకుడిగా వినాయక్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇక మహేర్ రమేష్ తో చిరంజీవి మరో సినిమా చేయనున్నారని సమాచారం.. అటు ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మిస్తారని టాక్..

ఇక గతంలో చిరంజీవి, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్, ఖైది 150 చిత్రాలు మంచి విజయాలని అందుకున్నాయి.. ఈ రెండు చిత్రాలు కూడా తమిళ్ చిత్రాలకి రీమేక్ లు కావడం విశేషం.. ఇది ఇలా ఉంటే ముందుగా వేదాళం చిత్రాన్ని పవన్ కల్యాణ్ రీమేక్ చేయాలనుకున్నారు.

Tags:    

Similar News