Breaking News: మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురయ్యారు. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్ బారినపడ్డారు. దాంతో, ఆచార్య సినిమా షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. మూడ్రోజులుగా ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆచార్య మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఏడు రోజుల షెడ్యూల్‌తో షూటింగ్ జరుపుతుండగా ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధిక వేడి కారణంగా చిరంజీవి డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దాంతో, మూడ్రోజుల్లోనే షూటింగ్‌ను ముగించేసిన చిత్ర యూనిట్ హైదరాబాద్ రిటర్న్ అయ్యింది. అయితే, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక మళ్లీ షూటింగ్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.