Chiranjeevi: ట్విట్టర్‌లో చిరంజీవి రికార్డు
Chiranjeevi: గతేడాది మార్చి 25న ఉగాది సందర్భంగా ట్విట్టర్‌లో అడుగుపెట్టారు చిరంజీవి
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి లేట్ గా వచ్చినా ఎప్పటికప్పుడు ఎదో ఒక వార్తతో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటారు. తన సహచర స్టార్స్ కంటే ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు తనదైన సలహాలు, సూచనలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన సహచర నటీనటుల పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్‌లో 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు గతేడాది మార్చి 25న ఉగాది సందర్భంగా ట్విట్టర్‌లో అడుగుపెట్టారు. అదే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరోవైపు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో కావడం లేదు. సోషల్ మీడియాలో ప్రవేశించిన యేడాది తర్వాత 1 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ట్విట్టర్ లో యువ హీరోలతో పోటీ పడుతున్నారు చిరంజీవి.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌తోఒ పవన్ ఫుల్ పాత్రలో చిరంజీవితో కలిసి కనిపించనున్నారు ఆ తర్వాత చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్‌తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాలం' రీమేక్‌లో నటించడానికీ రెడీ అవుతున్నారు.