పెళ్ళికి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్!
Sai Dharam Tej Marriage : టాలీవుడ్ లో మొన్నటిదాకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న యంగ్ హీరోలు నిఖిల్, నితిన్, రానాలు ఓ ఇంటి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరో కూడా చేరబోతున్నాడు.
Sai Dharam Tej Marriage : టాలీవుడ్ లో మొన్నటిదాకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న యంగ్ హీరోలు నిఖిల్, నితిన్, రానాలు ఓ ఇంటి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరో కూడా చేరబోతున్నాడు. ఇంతకి ఆ హీరో ఎవరో కాదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. అయితే నిఖిల్, నితిన్, రానా లది ప్రేమ వివాహం కాగా, సాయి ధరమ్ తేజ్ ది పెద్దలు కుదిర్చిన వివాహము అని తెలుస్తుంది... ఆంధ్రాకి చెందిన ఓ అమ్మాయిని సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. వచ్చే ఏడాది సమ్మర్లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అని ఆ వార్తల.. అయితే గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ అవి కేవలం పుకార్లు మాత్రమేనని తేలింది.. అయినప్పటికీ ఆ వార్తలకి బ్రేక్ పడడం లేదు.. అయితే తాజాగా వచ్చిన వార్త పైన సాయి ధరమ్ ఏమైనా క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా "సోలో బతుకే సో బెటర్" అనే సినిమాని చేస్తున్నాడు.. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచాయి. ఇది సాయి ధరమ్ తేజ్ కు 13 వ సినిమా కావడం విశేషం