Chiru154 Movie: చిరు 154వ చిత్రంలో "అన్నయ్య"తో నటించబోతున్న "తమ్ముడు"

* బాబీ దర్శకత్వంలో చిరు 154 వ చిత్రంలో చిరంజీవితో నటించనున్న పవన్ కళ్యాణ్

Update: 2021-11-09 11:32 GMT

చిరు154వ చిత్రంలో అన్నయ్యతో నటించబోతున్న తమ్ముడు

Chiru154 Movie - Pawan Kalyan: కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్ర షూటింగ్ లతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఆ సినిమా తరువాత చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో తన 154వ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని నవంబర్ 6న "ఇంక మన అన్నయ్య అరాచకం ఆరంభం" అంటూ మేకర్స్ విడుదల చేశారు. చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కించాలనుకున్న తన 12 ఏళ్ళ కల తాజాగా నిజమవడంతో దర్శకుడు బాబీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన బాబీ.. చిరు 154 తో అటు అన్నయ్యని, ఇటు తమ్ముడిని కలిపి మెగా అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇవ్వనున్నాడు. ఇక ఆచార్య సినిమాలో తనయుడు రామ్ చరణ్ తో నటించిన మెగాస్టార్, తన 154 వ చిత్రంతో తమ్ముడితో బిగ్ స్క్రీన్ ని షేర్ చేసుకొని త్వరలో అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిరు154 చిత్రానికి దేవిశ్రీప్రసాద్ తన సంగీతాన్ని అందించనున్నాడు.

Tags:    

Similar News