కరోనాను జయించిన నాగబాబు..
Nagababu Recovered From Coronavirus : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికీ సోకుతుంది. ఇందులో సినిమా ఇండస్ట్రీ పైన కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి.
Nagababu Recovered From Coronavirus : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికీ సోకుతుంది. ఇందులో సినిమా ఇండస్ట్రీ పైన కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అందులో భాగంగానే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్నాక నాగబాబు ఓ వీడియోని చేశారు. ఇందులో కరోనా సోకిన తర్వాత అయన ఎదురుకున్న కొన్ని అనుభవాలను అందులో పంచుకున్నారు.
ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను ఐదు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నట్టుగా వెల్లడించారు. నిహారిక నిశ్చితార్ధానికి ముందు కుడా కరోనా టెస్టు చేయించుకున్నట్టుగా వెల్లడించారు. అయితే తాజాగా చలి జ్వరంతో పాటు మత్తుగా నీరసంగా అనిపించడంతో మళ్ళీ కరోనా టెస్టు చేయగా అందులో కరోనా పాజిటివ్ గా వచ్చినట్టుగా వెల్లడించారు. దీనితో ఆందోళనకి గురయ్యానని అన్నారు.. ఆ తరవాత ఆస్పత్రిలో చేరగా ఐదురోజులు పాటు రెమిడెసివిర్ ఔషధాన్ని ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలో జ్వరం ఒళ్లు నొప్పులు తప్ప ఎటువంటి ఇబ్బంది నాకు కలుగలేదని నాగబాబు తెలిపారు.
మొత్తం 14 రోజుల తర్వాత వైరస్ నుంచి బయటపడ్డానని వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటునట్టుగా తెలిపారు. అయితే కరోనాకు ఎవరు అతీతులు కారని, ఎదో రకంగా ప్రతి ఒక్కరికి ఈ వైరస్ ఎటాక్ అవుతుందని, ఎవరు తప్పించుకోలేరని నాగబాబు అన్నారు. అయితే ఎక్కువ మంది కోలుకోవడం గొప్ప విశేషం అన్నారు. దీనికి ఎవరు భయపడొద్దుని అన్నారు. 14 రోజుల తర్వాత వైరస్ ఉన్నా మనకు హాని కలిగించదని అన్నారు. ఇక అటు త్వరలోనే ఫ్లాస్మా దానం చేస్తానని నాగబాబు వెల్లడించారు.