ఆర్‌.ఆర్‌.ఆర్‌ లో ఎన్టీఆర్,చరణ్‌ పాత్రల్లో బాలనటులుగా వీళ్ళే..!

Child Artists In RRR : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు..

Update: 2020-09-29 06:40 GMT

 ntr, charan

Child Artists In RRR : బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటిచింది.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ల చిన్నప్పటి సన్నివేశాలు ఉంటాయట.. అందులో నటించే బాలనటులు వీళ్ళే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చక్రి, వరుణ్‌ బుద్ధదేవ్‌, స్పందన చతుర్వేది ఈ సినిమాలో బాలనటులుగా నటిస్తున్నారట.. స్పందన చతుర్వేది తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్‌ చేస్తూ.. ''ఆర్‌.ఆర్‌.ఆర్‌' షూటింగ్‌లో అందమైన మధురజ్ఞాపకాలు.. దీన్ని ఆశీర్వాదంగా ఫీల్‌ అవుతున్నా" అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



ఇక మరోబాలనటుడు చక్రి ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. తానూ కొమరం భీమ్‌ చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నట్లుగా వెల్లడించాడు. దీనితో వరుణ్‌ బుద్ధదేవ్‌ అల్లూరి సీతారామరాజుగా చరణ్ చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇక సీతగా చిన్నప్పటి అలియా భట్ పాత్రలో స్పందన చతుర్వేది నటిస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.


Tags:    

Similar News