May Day 2021: తెలుగులో మేడే పై వచ్చిన సాంగ్స్
May Day 2021: ఏన్నో ఏళ్లుగా శ్రామికజన సంఘీభావ చిహ్నాంగా..జీవనాన్ని ఆకాంక్షిస్తూ మేడేను జరుపుకుంటున్నాం
May Day 2021: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఏన్నో ఏళ్లుగా శ్రామికజన సంఘీభావ చిహ్నాంగా..జీవనాన్ని ఆకాంక్షిస్తూ మేడేను జరుపుకుంటున్నాం. పరిశ్రమల్లో పనిచేయుటకు కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలోని పెట్టుబడిదారులు, కార్మికులు రెండు వర్గాలు పుట్టాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికులు శ్రమను దోచుకోవడం మొదలు పెట్టారు.
శ్రామికులచే బానిసల్లా పనిచేయించేవారు. పిల్లలు మహిళలు అనే విచక్షణలేకుండా కర్మాగారాలలో, గనులలో గొడ్డు చాకిరీ చేయించేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, గూడు వంటి ఉండేవి కాదు. రోజుకు 16 గంటలపైగా పనిచేయించేవారు. కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించే వారు. ఈ దారుణ చర్యల నేపధ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు అంకురించింది. కార్మికులు కోపంతో యంత్రాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వాలను యజమానులు ఆశ్రయించారు. ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యంత్రాలను ధ్వంసంచేసేవారికి మరణ శిక్ష విధిస్తూ చట్టం చేసింది. యామానులపై తిరుగుబావుటా ఎగరవేశారు.
శ్రామికుల హక్కులు తెలియజేస్తూ.. సినిమాల్లో చాలా పాటలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా ఆర్ నారాయణ మూర్తి సినిమాలన్నీ అందుకు సంబంధించినవే. ఆయన పాటలకు కూడా వారి కష్టాలను తెలియజేసేవిగా ఉంటాయి. శ్రామికుల కోసం సినిమాలు తీసిన వారిలో సూపర్ కృష్ణ, బాల కృష్ణ, మురళి మోహన్ కూడా ఉన్నారు. మేడే సందర్భంగా శ్రామిక వర్గాలకు సంబంధించిన తెలుగు సినిమా పాటలు మీకోసం.