'మిషన్ 2020' లో.. ''అల్లుడా బరిలో" మాస్ సాంగ్!

నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ ముఖ్య పాత్రల్లో కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిషన్ 2020.

Update: 2020-11-13 08:00 GMT

నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ ముఖ్య పాత్రల్లో కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిషన్ 2020. హనీ బన్నీ క్రియేషన్స్, మధు మృద్దు ఎంటర్ టైనేమెంట్స్, శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో కుంట్లూరు వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో " అల్లుడా బూరె లొండాలా .. అల్లుడా... " అనే మాస్ సాంగ్ ని ప్రముఖ దర్శకుడు తేజ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, షకలక శంకర్, శ్రీ రాపాక, దర్శకుడు కరణం బాబ్జి, నిర్మాతలు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ప్రముఖ దర్శకుడు తేజ మాట్లాడుతూ .. ''అల్లుడా బరిలోండాలా " సాంగ్ చాలా బాగుంది .. ఇప్పటికే అలా వైకుంఠపురంలో , పలాస లో రాసిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని సాంగ్ మూడో సూపర్ హిట్ సాంగ్ గా నిలుస్తుంది. ఈ పాటను తప్పకుండా అందరు ఎంజాయ్ చేస్తారు. ఇందులో శ్రీ తో పాటు షకలక శంకర్ చాల బాగా డాన్స్ చేసారు. ఈ సాంగ్ రాసిన సూరన్న పాటలు బాగా రాస్తారని తెలుసు. తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ .. మిషన్ 2020 సినిమా మాస్ సాంగ్ ని తేజ గారు విడుదల చేసారు. మాస్ సాంగ్స్ అంటే మా ఇద్దరి కాంబినేషన్ లో ఎలాంటి హిట్స్ అయ్యాయో అందరు చూసారు. ఈ సినిమాలోని మాస్ సాంగ్ చాలా బాగుంది. రాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, ఈ టీం కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.

నటుడు షకలక శంకర్ మాట్లాడుతూ .. హీరో ఈ సినిమా కోసం దర్శకుడు ఏది చెబితే అది చేశాను. శ్రీకాకుళం నేపథ్యం పై ఏ పాట వచ్చినా కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సాంగ్ తీసిన దర్శకుడు, నిర్మాతకు థాంక్స్, ఈ పాట ను ఉత్తరాంధ్రా ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్ రాసిన సూరన్న కు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. పాట పాడిన డాక్టర్ హరి కి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఈ సాంగ్ చూసాకా శ్రీ రాపాక ను హీరోయిన్ అనాలా, డాన్ అనాలా .. ఈమె ఊపిన ఊపు కు అందరు ఊపేస్తారు. ఆర్ పి పట్నాయక్ గారు చేసిన చిత్రం సినిమాలో సాంగ్స్ చిన్నప్పుడు థియటర్స్ లో యాభై రోజుల దాకా ప్రయత్నించినా టికెట్స్ దొరకలేదు. నిజంగా అయన సాంగ్స్ అంటే అంత ఇష్టం మాకు. ఇక మా గురువు తేజ గారితో సినిమా చేయాల్సింది కానీ కుదరలేదు. అది ఎప్పటికి కుదురుతుందో చూడాలి. ఇక ఈ టీం కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను అన్నారు.

శ్రీ రాపాక మాట్లాడుతూ .. నా కెరీర్ స్టార్ట్ అయింది తేజ గారి దగ్గరే. నాకు యాక్టింగ్ వచ్చా అని అడిగారు .. కానీ నేనెప్పుడూ యాక్టింగ్ నేర్చుకోలేదు. అయన హీరో, హీరోయిన్స్ కు యాక్టింగ్ నేర్పేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవారు. అలా అయన దగ్గరే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. అలాగే ఆర్పీ పట్నాయక్ గారు కూడా అప్పట్లో నన్ను నటిగా ప్రోత్సహించారు. ఇక ఈ కరోనా సమయంలో ఇంత రిస్క్ తో మంచి సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకుడికి నా స్పెషల్ థాంక్స్ చెప్పాలి. తప్పకుండా ఈ సాంగ్ ని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

రాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ .. ఈ సాంగ్ లాంచ్ చేసిన తేజ గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఒక సాంగ్ బాగా రావాలంటే అన్ని కరెక్ట్ గా కుదరాలి. అలాగే ఈ సినిమా కంపోజ్ చేసాక డాన్స్ మాస్టర్, ఆర్టిస్ట్ లు చక్కగా చేసారు. తప్పకుండా ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ .. గ్రేట్ కాంబినేషన్ తేజ గారు - పట్నాయక్ ల కాంబినేషన్ లో వచ్చిన ఫోక్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అలాగే మా సినిమాలోని ఫోక్ సాంగ్ కూడా హిట్ అవ్వాలని తేజ గారితో లాంచ్ చేయించాం. శ్రీ రాపాక, షకలక శంకర్ డాన్స్ తో ఇరగొట్టారు. సూరన్న గారు రాసిన మూడో సాంగ్ ఇది, ఆలా వైకుంఠపురంలో చిత్తరాల సీరపాడు సాంగ్, పలాస లో నక్కిలేసు గొలుసు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సాంగ్ ని దీపావళి సందర్భంగా డైరెక్టర్ తేజ గారు లాంచ్ చేసారు . ముందు రిలీజ్ చేసిన టీజర్ , సాంగ్ కి మంచి స్పందన వచ్చింది అలాగే ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. షకలక శంకర్ కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ .. ఈ సినిమాకు పనిచేసిన అందరికి థాంక్స్ చెప్పారు. ప్రతి ఒక్కరు చాలా చక్కగా సపోర్ట్ చేసారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ ని శ్రీ రాపాక, షకలక శంకర్ చేసి అదరగొట్టారు. తప్పకుండా ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. అలాగే ఈ సాంగ్ ని లాంచ్ చేసిన తేజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : రాప్ రాక్ షకీల్, ఎడిటింగ్ : ఎస్ బి ఉద్దవ్, ఆర్ట్ : జె కె మూర్తి, కెమెరా : వెంకట్ ప్రసాద్, డాన్స్ : గణేష్, ఫైట్స్ : సిందూరం సతీష్, స్టంట్ వై రవి , ప్రొడక్షన్ మేనేజర్ : రామారావు జాడ్డ , పీఆర్ ఓ : జర్నలిస్ట్ ప్రభు, నిర్మాతలు : కుంట్లూరు వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు, రచన, దర్శకత్వం : కరణం బాబ్జి.


Full View

Tags:    

Similar News