Breaking News: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

Breaking News: మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు.

Update: 2021-10-10 15:33 GMT

Breaking News: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

Breaking News: ఉత్కంఠ రేపిన మా ఎన్నికల్లో మంచు ప్యానెల్ విజయ దుందుబి మోగించింది. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందాడు. ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. భారీ ఆధిక్యంతో ప్రకాశ్ రాజ్‌పై గెలుపొందాడు మంచు విష్ణు. 400 కు పైగా ఓట్ల మెజార్టీ సాధించాడు.

"మా" ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నిమిష నిమిషానికి రిజల్ట్స్ మారాయి. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. 'మా' జనరల్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానెల్‌కు చెందిన రఘుబాబు విజయం సాధించాడు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు చెందిన జీవిత రాజశేఖర్‌పై ఏడు ఓట్ల తేడాతో రఘుబాబు గెలుపొందారు.

'మా' వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్యానెల్‌కు చెందిన మాదాల రవి విజయం సాధించాడు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు చెందిన బెనర్జీపై మాదాల రవి గెలుపొందాడు. 'మా' కొత్త ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌ ఎన్నికయ్యారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి బరిలో దిగిన శ్రీకాంత్‌ మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన బాబూమోహన్‌పై జయకేతనం ఎగురవేశారు.

కోశాధికారిగా విష్ణు ప్యానల్‌ తరఫు నుంచి బరిలో నిలిచిన శివ బాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోని నాగినీడుపై శివ బాలాజీ గెలుపొందారు. నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివ బాలాజీ గెలుపొందారు. శివ బాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకి 284 ఓట్లు పడ్డాయి. ఈసీ సభ్యులు మాత్రం ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ నుంచి అత్యధికంగా గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది ఈసీ సభ్యులుగా గెలుపొందగా మంచు విష్ణు ప్యానెల్ నుంచి ఏడుగురు ఈసీ సభ్యులుగా విజయం సాధించారు. 

Tags:    

Similar News