Manchu Vishnu on 10th class exams: పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయండి అంటున్న టాలీవుడ్ హీరో!

Manchu Manoj on 10th class exams: రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా మీదా వాయిదా పడుతూ చివరగా రద్దు అయిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2020-06-29 17:29 GMT
Manchu Vishnu on 10th class exams: పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయండి అంటున్న టాలీవుడ్ హీరో!
  • whatsapp icon

Manchu Vishnu mments 10th class exams: రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా మీదా వాయిదా పడుతూ చివరగా రద్దు అయిపోయిన సంగతి తెలిసిందే...ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కష్టం అని ఓ అభిప్రాయానికి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ అందరి విద్యార్ధులను పాస్ చేస్తున్నట్టుగా ప్రకటించాయి.

అయితే మొత్తం పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలను రద్దు చేయాలనీ టాలీవుడ్‌ యంగ్ హీరో మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని కోరుకుంటున్నట్టుగా మంచు విష్ణు తెలిపాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు విష్ణు ట్వీట్ కి చాలా మంది మద్దతు ఇస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని కొందరు గుర్తుచేస్తున్నారు.

ఇక మంచు విష్ణు సినిమాల విషయానికి వచ్చేసరికి విష్ణు సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు కి 2007 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ చిత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక దేనికైనా రేడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం సినిమాలు విష్ణుకి మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతం విష్ణు మోసగాళ్ళు అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో కాజల్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. 


Tags:    

Similar News