యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు

Update: 2025-04-09 14:56 GMT

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు

Manchu Mohan Babu and Manchu Vishnu meets UP CM Yogi Adityanath: మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. సినీ రంగంలో కొనసాగుతున్న వీళ్లు నిత్యం రాజకీయాల్లో, రాష్ట్ర పరిపాలనలో తల మునకలై ఉండే యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం వెనుక కారణం లేకపోలేదు. ప్రస్తుతం మోహన్ బాబు, మంచు విష్ణులు కన్నప్ప మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

భారీ సంఖ్యలో వివిధ భాషలకు చెందిన పేరున్న నటీనటులతో మంచు మోహన్ బాబు నిర్మిస్తోన్న సినిమా ఇది. ముకేష్ కమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మంచు విష్ణు శివుడికి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో కనిపించనున్నాడు.

మళయాళం నుండి మోహన్ లాల్, టాలీవుడ్ నుండి ప్రభాస్, కోలీవుడ్ నుండి శరత్ కుమార్, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి శివరాజ్ కుమార్ లాంటి పాపులర్ యాక్టర్స్ ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతే భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తమిళ, తెలుగు, మళయాళం, కన్న, హిందీ భాషల్లో పేరున్న నిర్మాణ సంస్థలతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలోనూ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ తీసుకురావాలని మోహన్ బాబు అండ్ టీమ్ భావిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. యోగి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేశారు. జూన్ 27న కన్నప్ప మూవీని రీలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

మోహన్ బాబు ఇంటికి ఎదురుగా మంచు మనోజ్ ఆందోళన

మోహన్ బాబు, మంచు విష్ణు లక్నోలో ఇలా కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా మరోవైపు హైదరాబాద్‌లో మంచు మనోజ్ మరో రకంగా వార్తల్లోకొచ్చాడు. మనోజ్ తన తండ్రి మోహన్ బాబు ఇంటికి ఎదురుగా బైఠాయించి ఆందోళనకు దిగాడు. ఆ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ వివాదం పోలీసు స్టేషన్, కోర్టు, జిల్లా కలెక్టరేట్ వరకు వెళ్లాయి.

Tags:    

Similar News