Manchu Manoj Marriage: మోహన్ బాబు లేకుండానే మంచు మనోజ్ పెళ్లి జరిగిందా?
* మంచు మనోజ్ పెళ్ళికి మోహన్ బాబు రాలేదా?
Manchu Manoj Marriage: ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరియు రాజకీయ కుటుంబానికి సంబంధించిన భూమా మౌనిక రెడ్డి ఈ మధ్యనే పెళ్లి బంధంతో ఒకటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అందులో మొదటిది మోహన్ బాబు గురించి. మంచు మనోజ్ రెండవ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబు కి ఇష్టం లేదని అందులోనూ భూమా మౌనిక రెడ్డిని చేసుకోవటం ఏమాత్రం నచ్చలేదని అందుకే మోహన్ బాబు మంచు మనోజ్ పెళ్లికి రావడం లేదని సోషల్ మీడియా లో ఎన్నో కథనాలు వినిపించాయి.
మోహన్ బాబు రావడంలేదని మంచు విష్ణు కూడా వీరి పెళ్లికి హాజరు కావడం లేదని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితే ఈ పుకార్లలో ఏ మాత్రం నిజం లేదు అని మంచు మనోజ్ పెళ్లి ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. పెళ్లి తర్వాత నవ దంపతులకు సంబంధించి ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. అందులో మంచి మోహన్ బాబు దంపతులు నవ్వుతూ చాలా ఆనందంగా కనిపించారు. అంతేకాకుండా మోహన్ బాబు గుండెల పై తలపెట్టి మౌనిక రెడ్డి ఎమోషనల్ అయిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇక ఈ ఫోటోలు చూస్తే మోహన్ బాబు దంపతులే దగ్గరుండి మనోజ్ రెండవ పెళ్లి జరిపించినట్లు తెలుస్తోంది. కానీ మంచు విష్ణు దంపతులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే వీరు నిజంగానే పెళ్ళికి రాలేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.