ఇంట్రెస్టింగ్: ఒకే ఫ్రేమ్ లో చరణ్, మనోజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మంచు మనోజ్ కలిసి నటించానున్నారా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Update: 2020-03-19 14:48 GMT
Ram Charan and Manchu Manoj (File Photo)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మంచు మనోజ్ కలిసి నటించానున్నారా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.. గతంలో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన 'బిల్లా రంగా' మూవీలో వీరిద్దరూ కలిసి నటించనున్నారని తెలుస్తోంది. . కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'బిల్లా రంగా' అపట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేయాలనీ టాలీవుడ్ లోని ప్రముఖ దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట! కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ లో చరణ్

ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే )చిత్రంలో నటిస్తున్నాడు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని 400 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8 న సినిమాని రిలీజ్ చేయనున్నారు.

"అహం బ్రహ్మాస్మి" లో మనోజ్:

మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎంఎం ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి మనోజే సొంతంగా సినిమాని నిర్మిస్తున్నారు. మనోజ్ సరసన ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు , తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం బాషలలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. 

Tags:    

Similar News