నేను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నా.. మంచు లక్ష్మి షాకింగ్‌ కామెంట్స్‌..

Manchu Lakshmi: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మి మంచు కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.

Update: 2022-03-09 12:30 GMT

Manchu Lakshmi: కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ పై నోరు విప్పిన మంచు లక్ష్మి

Manchu Lakshmi: తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా మాట్లాడుతూ లక్ష్మి మంచు కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. ఎంత స్టార్ కిడ్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటికీ తాను కూడా కాస్టింగ్ కౌచ్‌ మరియు బాడీ షేమింగ్ కి బాధితురాలిని అని లక్ష్మి చెప్పటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు అయ్యి ఉండి కూడా ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు ఎదుర్కోవడం గురించి మంచు లక్ష్మి మాట్లాడింది.

ఆమె ఇప్పటివరకు తన కెరీర్‌లో సెక్సిజం, కాస్టింగ్ కౌచ్‌ లాంటివి ఎదుర్కొన్నానని ఈ పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది లక్ష్మి. "ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ ఇది చాలా సాధారణ సమస్య గా మారింది. ఎలాంటి వృత్తి అయినా అమ్మాయిలు వీటిని ఎదుర్కొంటున్నారు. ఐటీ, బ్యాంకింగ్, సినిమాలు ఇలా ప్రతిచోటా ఇలాంటివి జరుగుతున్నాయి. మొదట్లో నా తండ్రి స్టార్ కాబట్టి అలాంటిదేమీ జరగదని గట్టి నమ్మకంతో ఉన్నాను.

కానీ అందరూ న్యాయంగా ఉండరు. బాడీ షేమింగ్ దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా మనల్ని ప్రభావితం చేస్తోంది. లావుగా ఉంటే లావుగా ఉన్నవని అన్నారు. సన్నబడితే సన్నగా ఉన్నావు అంటారు. అయితే మనం అందరినీ సంతోషపెట్టలేము. మనం కేవలం మన గురించి మాత్రమే బతకాలి" అని చెప్పుకొచ్చింది లక్ష్మి.

Tags:    

Similar News